భారత సాంప్రదాయం ప్రకారం ఆస్ట్రేలియన్ క్రికెటర్ నిశ్చితార్ధం..!

ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. భారత సంతతికి చెందిన విని రామన్‌ను భారత సంప్రదాయం ప్రకారం నిశ్చితార్ధం చేసుకున్నారు గ్లెన్ మాక్స్‌వెల్.

భారత సాంప్రదాయం ప్రకారం ఆస్ట్రేలియన్ క్రికెటర్ నిశ్చితార్ధం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 16, 2020 | 7:03 AM

ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. భారత సంతతికి చెందిన విని రామన్‌ను భారత సంప్రదాయం ప్రకారం నిశ్చితార్ధం చేసుకున్నారు గ్లెన్ మాక్స్‌వెల్. మెల్‌బోర్న్‌లో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న విని రామన్‌ను గ్లెన్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నారు. బిగ్‌బాల్ లీగ్ సమయంలో ఆ విషయాన్ని బహిరంగంగా వ్యక్తపరిచిన గ్లెన్.. తాజాగా ఆమెతో నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని విని రామన్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. ఫొటోలను షేర్ చేశారు.

అయితే మోచేతి గాయం కారణంగా గత కొద్దిరోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న గ్లెన్.. ఆ తరువాత బిగ్‌బాష్ లీగ్‌‌‌‌‌‌లో అదరగొట్టేశారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం ఐపీఎల్‌లో గ్లెన్‌ను రూ.10.75కోట్లకు కింగ్స్ ఎలివెన్ పంజాబ్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడగా.. ఆ లోపు తన నిశ్చితార్ధాన్ని పూర్తి చేసుకున్నారు ఈ క్రికెటర్. కాగా వివాహం ఎప్పుడు జరుగుతుందన్న దానిపై ఈ జంట ఇంకా స్పష్టతను ఇవ్వలేదు.

https://www.instagram.com/p/B9taXQkpEtc/?utm_source=ig_embed

Read This Story Also: మిర్యాలగూడ పీఎస్‌కు అమృత..అతడిపై కంప్లైంట్..