“టీ20ల్లో డబుల్ సెంచరీ బాదే దమ్ము రోహిత్‌కు మాత్రమే ఉంది”
టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయగల దమ్ము ప్రజంట్ ఉన్న క్రికెటర్స్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు మాత్రమే ఉందని ఆసిస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో ఇప్పటికే మూడు సార్ల ద్విశతకాలు బాదిన రోహిత్, టెస్టుల్లోనూ పోయిన సంవత్సరం డబుల్ సెంచరీ ఫీట్‌ను అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో మాత్రం రోహిత్ టాప్ స్కోరు 109 మాత్రమే. ఐపీఎల్‌తో కలుపుకుంటే హిట్ మ్యాన్ టీ20 ఫార్మాట్‌లో 5 సెంచరీలను రోహిత్ నమోదు చేశాడు. 2003లో […]
టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయగల దమ్ము ప్రజంట్ ఉన్న క్రికెటర్స్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు మాత్రమే ఉందని ఆసిస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో ఇప్పటికే మూడు సార్ల ద్విశతకాలు బాదిన రోహిత్, టెస్టుల్లోనూ పోయిన సంవత్సరం డబుల్ సెంచరీ ఫీట్‌ను అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో మాత్రం రోహిత్ టాప్ స్కోరు 109 మాత్రమే. ఐపీఎల్‌తో కలుపుకుంటే హిట్ మ్యాన్ టీ20 ఫార్మాట్‌లో 5 సెంచరీలను రోహిత్ నమోదు చేశాడు.
2003లో ప్రపంచ క్రికెట్‌కు టీ20 ఫార్మాట్ పరిచయమైంది. అప్పట్నుంచి ఒక్కరు కూడా డబుల్ సెంచరీ ఫీట్ అందుకోలేదు. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో 175 పరుగులను చేశాడు. ఈ పార్మాట్‌లో అదే టాప్ స్కోర్. గేల్ తర్వాత లిస్ట్‌లో ఆరోన్ ఫించ్(172) రన్స్‌తో ఉన్నాడు. అయితే కనీసం వాళ్లిద్దరి పేరు కూడా ఎత్తని బ్రాడ్ హగ్..రోహిత్‌కే ఆ సత్తా ఉందంటూ ఆకాశానికి ఎత్తేశాడు.