ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?
COVID 19: కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొద్దిరోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ మార్చి 29న ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత్‌లో కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఆ తర్వాత టోర్నీని ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై శనివారం ఫ్రాంచైజీలతో బీఐసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సమావేశమయ్యాడు. దాని తగ్గట్టుగానే […]
COVID 19: కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొద్దిరోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ మార్చి 29న ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత్‌లో కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఆ తర్వాత టోర్నీని ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై శనివారం ఫ్రాంచైజీలతో బీఐసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సమావేశమయ్యాడు. దాని తగ్గట్టుగానే ఐపీఎల్ ప్రారంభానికి మరో ఐదు తేదీలను నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 15తో పాటు ఏప్రిల్ 21, 25, మే 1, మే 5 తేదీలను బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలతో ఏప్రిల్ 14న మరోసారి భేటీ అయ్యి.. ఈ తేదీల్లో ఒకదాన్ని ఫైనల్ చేస్తారని సమాచారం. అంతేకాకుండా కుదిరితే రెండు లేదా మూడు స్టేడియంలలో మ్యాచులు నిర్వహించి.. వీక్షకులు లేకుండానే టోర్నీని పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. అయితే భారత్‌లో కరోనా వ్యాప్తి వేగంగా వృద్ధి చెందుతుండటంతో టోర్నీ పూర్తిగా రద్దవుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే బీసీసీఐకు 10 వేల కోట్లు నష్టం వాటిల్లుతుందని సమాచారం.
For More News:
ఉగ్రవాదులకు భయాన్ని పరిచయం చేసిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌స్టాప్..
కొత్త జంటలకు విలన్‌గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..
రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!
ఇండియాలో విజృంభిస్తున్న కరోనా.. దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..
Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..
కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం