Tata AIG: కారు ఇన్సూరెన్స్‌లో యాడ్ ఆన్ కవర్ ప్రాముఖ్యత ఏంటి.? టాటీ ఏఐజీ అందిస్తోన్న..
వాతావరణం, రోడ్డు నాణ్యతతో పాటు కొన్ని రకాల అనూహ్యమైన సంఘటనల నుంచి సమగ్రమైన కవర్ లభించేలా ఈ యాడ్ ఆన్స్ ఉపయోగపడుతాయి. ఇంతకీ కారు ఇన్సూరెన్స్‌లో యాడ్ ఆన్ కవర్ ప్రాముఖ్యత ఏంటి.? ప్రముఖ కార్ ఇన్సూరెన్స్ సంస్థ టాటీ ఏఐజీ అందిస్తోన్న ఆడ్ ఆన్ పాలసీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. టాటా ఏఐజీ అందిస్తోన్న కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్ ద్వారా...
కారు ఉపయోగించే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే విషయం తెలిసిందే. చట్టపరంగా కూడా కచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలనే నిబంధన ఉండే ఉంది. ఇదిలా ఉంటే సాధారణంగా కస్టమర్లు తీసుకునే ఈ బీమాకు అదనంగా యాడ్ ఆన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్‌గా తీసుకునే పాలసీకి అదనపు ప్రీమియంతో ప్రాథమికంగా తీసుకున్న పాలసీని మరింత బలోపేతం చేయొచ్చు.
వాతావరణం, రోడ్డు నాణ్యతతో పాటు కొన్ని రకాల అనూహ్యమైన సంఘటనల నుంచి సమగ్రమైన కవర్ లభించేలా ఈ యాడ్ ఆన్స్ ఉపయోగపడుతాయి. ఇంతకీ కారు ఇన్సూరెన్స్‌లో యాడ్ ఆన్ కవర్ ప్రాముఖ్యత ఏంటి.? ప్రముఖ కార్ ఇన్సూరెన్స్ సంస్థ టాటీ ఏఐజీ అందిస్తోన్న ఆడ్ ఆన్ పాలసీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. టాటా ఏఐజీ అందిస్తోన్న కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్ ద్వారా తమ పాలసీదారులకు ప్రకృతి వైపరీత్యాలు మొదలు, నాణ్యత లేని రోడ్ల కారణంగా జరిగిన ప్రమాదాలకు సైతం బీమా చెల్లిస్తాయి. టాటా ఏఐజీ తన పాలసీదారులకు అందిస్తోన్న కొన్ని ఆడ్ ఆన్స్ పాలసీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* టాటా ఏఐజీ అందిస్తోన్న ఆడ్ ఆన్స్‌లో జీరో తరుగుదల ఒకటి. ఇందులో భాగంగా పాలసీదారులు మొదటి రెండు క్లెయిమ్‌లను మినహాయించి, మరమ్మతుల సమయంలో మీ కారు విడి భాగాల తరుగుదల ధరను కవర్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. క్లెయిమ్ సమయంలో టాటీ ఏఐజీ మీ పూర్తి రిపేర్ ఖర్చును కవర్ చేస్తుంది.
* నో క్లైమ్ బోనస్ ప్రొటెక్షన్: టాటా ఏఐజీ అందిస్తోన్న ఈ సదుపాయంతో మీరు ఒకవేళ ఏడాదిలో ఇన్సూరెన్స్‌ను ఉపయోగించుకోకపోతే.. వచ్చే ఏడాది 50 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చు. పాలసీ ఏడాదిలో నిర్ణీత సంఖ్యలో క్లెయిమ్‌లను ఫైల్ చేయడానికి మిమ్మల్ని అనుతమిస్తుంది.
* రిటర్న్ టు ఇన్‌వాయిస్: టాటా ఏఐజీ ఆడ్ యాన్ పాలసీని తీసుకున్నట్లయితే.. ఒకవేళ మీ కారు పూర్తి స్థాయిలో పాడైపోతే, మీరు కారు ధరకు సమానమైన ఇన్ వాయిస్‌ను పొందొచ్చు. అయితే ఈ సదుపాయం ఐదేళ్లలోపు కార్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
* ఇంజన్ సెక్యూర్: కారు ఇంజన్‌లోని భాగాలైన గేర్ బాక్స్, ట్రాన్స్‌మిషన్ వంటి పార్ట్స్ రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చ ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతుంది. వాటర్ డ్యామేజ్ లేదా ల్యూబ్రికెంట్ లీకేజ్ వాటికి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
* టైర్ సెక్క్యూర్: ప్రమాద సమయంలో కారు టైర్‌లకు జరిగిన నస్టానికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. రిపేర్, రీప్లేస్‌మెంట్ వంటి వాటికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అయితే కేవలం 5 ఏళ్లలోపు కార్లకు మాత్రమే వర్తిస్తుంది.
* కన్స్యూమబుల్ ఎక్స్‌పెన్స్: ప్రమాదాల సమయంలో డ్యామేజ్ కారణంగా.. స్కూలు, నట్లు, బోల్ట్‌లు, ఇంజన్ ఆయిల్, గేర్‌బాక్స్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్‌లు, డిస్టిల్డ్ వాటర్ వంటి వాటిని రీప్లేస్ చేయడానికి ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.
* రోడ్‌సైడ్ అసిస్టెన్స్: అత్యవసర సమయంలో రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఈ ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయి. ఉదాహరణకు.. ఆన్‌సైట్ రిపేయిర్, ఫ్యూయల్ డెలివరీ వంటివి ఇందులో కవర్ అవుతాయి. ఒకవేళ కారు బ్రేక్ డౌన్ అయితే సేవలు అందిస్తారు.
* ఎమర్జేన్సీ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హోటల్ ఖర్చులు: ఒకవేళ కారు ప్రమాదం జరిగిన సమయంలో మీ వాహనం అక్కడి నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉంటే.. రాత్రిపూట మీకు సమీపంగా ఉన్న నగరంలో హాటల్‌లో వసతి, టాక్సీ ఛార్జీలు కూడా ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయి.
* కీ రీప్లేస్‌మెంట్: టాటా ఏఐజీ యాడ్ ఆన్స్ తీసుకుంటే.. మీ కారు కీస్ పోయినా, ఎవరైనా దొంగలించినా కొత్త కీ కొనుగోలు కూడా పాలసీలో కవర్ అవుతుంది. అయితే వాహనాన్ని సొంత ఉపయోగాల కోసం కొనుగోలు చేస్తేనే ఇది వర్తిస్తుంది.
* గ్లాస్, ఫైబర్, ప్లాస్టిక్ పార్ట్స్ రిపేయిర్: మీ నో క్లైమ్ బోనస్ ప్రొటెక్షన్‌లో లభించే డిస్కౌంట్‌కు ఎలాంటి సంబంధం లేకుండానే.. కారుకు సంబంధించి గ్లాస్, ఫైబర్, ప్లాస్టిక్ వస్తువుల రిపేయిర్‌కు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు.
* డైలీ అలవెన్స్: ఒకవేళ మీ కారు రిపేర్‌లో ఉంటే గరిష్టంగా 10 రోజుల పాటు మీ ప్రయాణ ఖర్చులకు పరిహారం లభిస్తుంది. ఒకవేళ కారు పూర్తిగా పాడయినా, దొంగలించబడినా.. 15 రోజుల పాటు కవరేజీ లభిస్తుంది.
* వ్యక్తిగత వస్తువులు పోతే: ప్రమాద సమయంలో మీ, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులైన దుస్తులు, ఆడియో, వీడియో టేప్స్ వంటి వాటికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే డబ్బులు, క్రెడిట్/డెబిట్ కార్డులు, చెక్స్, వాచీలు, జువెలరీ వంటి వాటికి ఇన్సూరెన్స్ వర్తించదు.
టాటా ఏఐజీలో ఏ కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్ కొనుగోలు చేయాలి.?
ఇది మీ వ్యక్తిగత ఇన్సూరెన్స్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఉండే చోట నిత్యం వరదలు వస్తే.. మీరు ఇంజన్ ప్రొటెక్షన్ కవర్‌ను తీసుకోవాలి. ఒకవేళ మీరు ప్రయణించే దారిలో రోడ్లు సరిగ్గా లేకపోయినా, నిత్యం ఎక్కువ దూరం ప్రయణిస్తున్నా.. రోడ్ అసిస్టెన్స్ కవర్‌ను తీసుకుంటే బెటర్. ఇక అందరు పాలసీ హోల్డర్స్‌కు సాధారణంగా సూచించదగిన వాటిలో జీరో డిప్రిషేషన్, నో క్లైమ్ బోనస్ ప్రొటెక్షన్, రిటర్న్ టు ఇన్ వాయిస్ వంటి వాటిని సూచించవచ్చు.
మొత్తం మీద మీకు అప్పటి వరకు ఉన్న కారు ఇన్సూరెన్స్‌కు యాడ్ ఆన్స్ ఒక బూస్ట్ ప్లాన్‌లా ఉపయోగపడతాయి. అధిక ధర చెల్లిస్తున్నందుకు, అధిక కవరేజ్ లభిస్తుంది. ఒకవేళ మీరు కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్ సేవలు వినియోగించుకోవాలంటే ముందుగా కార్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌లో లెక్కగట్టి బెస్ట్ ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇది మీ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి పాలసీ తీసుకోవాలో సూచిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..