Dehydration: డీహైడ్రేషన్ బారిన పడడానికి ఇవి కూడా కారణాలని మీకు తెలుసా.? పూర్తి వివరాలు..
అతిసారం బారిన పడిన వారికి ఓఆర్‌ఎస్ అందించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ఇతర ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌తో ఓఆర్‌ఎస్‌ను రీప్లేస్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక అతిసారం బారిన పడి వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అతిసారం కానీ కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల శరీరంలో కేవలం నీటి శాతం, ఎలక్ట్రోలైట్స్ శాతం మాత్రమే...
సాధారణంగా శరీరంలో నీటి శాతం తగ్గడాన్ని డీహైడ్రేషన్ అంటారని తెలిసిందే. శరీరంలో నీటి శాతం తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తగినంత నీటిని తీసుకోకపోవడం, సోడియం, పొటాషియం, కాల్షియం ఉన్నట్లుండి తగ్గిపోవడం వంటి వాటి వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుందని తెలిసిందే. సాధారణంగా డీహైడ్రేషన్ సమస్య అతిసారం వల్ల వస్తుందని తెలిసిందే. అయితే కేవలం అతిసారం వల్ల మాత్రమే కాకుండా.. జ్వరం, వైరల్ ఇల్‌నెస్, విపరీతమైన వాంతి, టైఫాయిడ్, డెండ్యూ, మలేరియా వంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా డీహైడ్రేషన్ తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అతిసారం బారిన పడిన వారికి ఓఆర్‌ఎస్ అందించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ఇతర ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌తో ఓఆర్‌ఎస్‌ను రీప్లేస్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక అతిసారం బారిన పడి వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అతిసారం కానీ కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల శరీరంలో కేవలం నీటి శాతం, ఎలక్ట్రోలైట్స్ శాతం మాత్రమే తగ్గకుండా శక్తి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. చమట, వాంతి వంటి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఎలక్ట్రోలైట్స్‌తో పాటు ఎనర్జీ లెవల్స్ కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక జ్వరం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తే సందర్భాల్లో.. అధికంగా చమట పట్టడం, విపరీతమైన దగ్గు, బాగా గాలి పీల్చుకోవడం, ఎడతెరపి లేకుండా వాంతులు ఉంటే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక జ్వరంతో ఉన్న సమయంలో ఆహారం రుచించకపోవడం, నీటిని తీసుకోవాలనిపించకపోవడం కూడా డీహైడ్రేషన్‌కు కారణంగా చెబుతున్నారు. ఇక భారతీయ వైద్యులకు ఉన్న అవగాహన, అనుభవం ప్రకారం.. అతిసారం కానీ డీహైడ్రేషన్ వల్ల లిక్విడ్ ఎలక్ట్రోలైట్ లోటు శరీరంలో ఎక్కువగా ఉంటుందని, దీనికి త్వరగా పరిష్కారం చూపకపోతే ఆరోగ్యం మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని హైదరాబాద్‌లోని ఆలివ్ హాస్పిటల్‌కు చెందిన ఫిజిషియ్ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ మజిద్ద్ ఖాన్ తెలిపారు.
జ్వరం కారణంగా శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను కొబ్బరి నీరు వంటి డ్రింక్స్‌తో భర్తీ చేయవచ్చు. సులభంగా అందుబాటులో ఉండడం కారణంగా చాలా కాలంగా కొబ్బరి నీటిని దీనికి మంచి పరిష్కారంగా చెబుతున్నారు. అయితే కొబ్బరి నీటిలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉన్నా.. అత్యవసరమైన ఎలక్ట్రోఐట్ సోడియం, పొటాషియంతో పాటు శక్తి తక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు.
జ్వరం ఉన్న వారికి ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిఫార్సుల ద్వారా రోగులను కోలుకునే వేగాన్ని మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. రెడీ టు సర్వ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ శరీరానికి కావాల్సిన ఇన్‌స్టాంట్ శక్తిని అందిస్తాయి. ఈ డ్రింక్స్‌లో ఎలక్ట్రోలైట్స్, ఎనర్జీ లెవల్స్ స్థాయిలను చూపిస్తారు. అలాగే ఈ డ్రింక్స్ రుచిలో కూడా బాగుండడం వల్ల వినియోగదారులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌లో పేర్కొన్న ఎనర్జీ, ఎలక్ట్రోలైట్‌లపై దృష్టి పెట్టాలి. డ్రింక్‌లో ఉన్న విటమిన్స్‌పై కూడా దృష్టి పెట్టాలి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..