Vinayaka Chavithi 2024: ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఏ దేశంలో ఉందో తెలుసా..! ఆ దేశానికి రక్షకుడుగా పూజలు..
థాయ్‌లాండ్ టూరిజం డైరెక్టరీ ప్రకారం గణపతి విగ్రహాన్ని పోలీసు జనరల్ సోమ్‌చై వానిచ్సేని నేతృత్వంలోని చాచోంగ్‌సావో స్థానిక సంఘం సమూహం నిర్మించింది. ఈ గ్రూప్ ఛైర్మన్ 2009లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ గణపతి విగ్రహాన్ని 854 వేర్వేరు భాగాలను కలిపి తయారు చేశారు. చచోయెంగ్‌సావోలోని క్లోంగ్ ఖువాన్ జిల్లాలో 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడిన భారీ గణేశ విగ్రహం దేశ సంరక్షకుడిగా చెబుతారు.
దేశంలో గణపతి పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు థాయ్‌లాండ్‌పై కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అక్కడ ఉన్న గణపతి విగ్రహమే.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని థాయ్‌లాండ్‌లోని ఖ్లాంగ్ ఖ్వాన్ నగరంలోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేశారు. 128 అడుగుల ఎత్తున్న రాగి గణేశుడు ఎత్తులో మాత్రమే కాదు ఆకర్షణీయమైన రూపంతో కూడా పేరుగాంచాడు.
39 మీటర్ల ఎత్తైన గణపతి విగ్రహం కుడివైపు పైభాగంలో పనసపండు ఉంది. ఇది సమృద్ధి, శ్రేయస్సుకు చిహ్నం. ఎగువ ఎడమ చేతిలో చెరకు గెడ ఉంది. ఇది తీపి, ఆనందాన్ని సూచిస్తుంది. దిగువ కుడి చేతిలో అరటిపండు ఉంది. ఇది పోషణకు ప్రతీక. దిగువ ఎడమ చేతిలో మామిడి పండు ఉంది. ఇది జ్ఞానంతో సంబంధం ఉన్న పండు.
ఈ భారీ విగ్రహాన్ని ఎప్పుడు, ఎలా తయారు చేశారంటే
థాయ్‌లాండ్ టూరిజం డైరెక్టరీ ప్రకారం గణపతి విగ్రహాన్ని పోలీసు జనరల్ సోమ్‌చై వానిచ్సేని నేతృత్వంలోని చాచోంగ్‌సావో స్థానిక సంఘం సమూహం నిర్మించింది. ఈ గ్రూప్ ఛైర్మన్ 2009లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ గణపతి విగ్రహాన్ని 854 వేర్వేరు భాగాలను కలిపి తయారు చేశారు.
చచోయెంగ్‌సావోలోని క్లోంగ్ ఖువాన్ జిల్లాలో 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడిన భారీ గణేశ విగ్రహం దేశ సంరక్షకుడిగా చెబుతారు. థాయ్‌లాండ్‌లో ఇది స్థానిక జీవనశైలి, ఆర్థిక వ్యవస్థతో సామరస్యపూర్వక ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని నమ్మకం. అంతేకాదు ఈ గణపతి విగ్రహం దైవానుగ్రహానికి చిహ్నం.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
బౌద్ధమతంలో హిందూ దేవతకు ప్రత్యేక స్థానం
బౌద్ధమతం అధికంగా ఉన్న థాయ్‌లాండ్‌లో వినాయకుడికి ప్రముఖ స్థానం ఉంది. జీవితంలో అడ్డంకులను అధిగమించడానికి, తమ లక్ష్యాలను సాధించడానికి ప్రజలకు మార్గం చూపే దైవంగా గణేశుడిని పిలుస్తారు. థాయ్‌లాండ్‌లో గణేశ ఆరాధన మూలాలు ఆగ్నేయాసియాలో బ్రాహ్మణ మతం ప్రాబల్యం పొందుతున్న కాలం నాటివి. ఆ సమయాల్లో గణేశుడు జ్ఞానం, సంపద ఇచ్చే దేవుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ విధంగా ఇక్కడ ఉన్న భారీ గణపతి విగ్రహం కళకు అద్భుతమైన ఉదాహరణ మాత్రమే కాదు.. ఇది చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా కూడా అభివృద్ధి చేయబడింది. ఈ విగ్రహం ఉన్న ఖ్లాంగ్ ఖువాన్ గణేశ అంతర్జాతీయ ఉద్యానవనం థాయ్‌లాండ్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది.
గణేశుడి విగ్రహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు
ఆధ్యాత్మిక శోభని ఇచ్చే ఈ అంతర్జాతీయ ఉద్యానవనం లోకల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ చాచోంగ్సావో కూడా ఉంది. ఇది సంస్కృతి, వారసత్వ కేంద్రంగా ఖ్యాతిగాంచింది. ఇది సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. థాయ్‌లాండ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం అనే విశ్వాసం. ఇది ఐక్యత, ఆశీర్వాదాలకు మహోన్నత చిహ్నంగా నిలుస్తుంది. దీని వైభవం మానవ సృజనాత్మకత, భక్తి ఔన్నత్యానికి ప్రతిబింబమే కాదు గణేశుని విగ్రహం విశ్వవ్యాప్త ఆకర్షణను ప్రతిబింబిస్తుంది. గణపతి ఆశీర్వాదం దేశ సరిహద్దులు, నమ్మకాలను అధిగమించాయి. ఈ వినాయక విగ్రహాన్ని చూసేందుకు భారతదేశం నుండే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల నుండి ప్రజలు వస్తుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..