Durga Temple: మరో వివాదంలో దుర్గమ్మ ఆలయం.. అంతరాలయంలోని అమ్మవారిని చిత్రీకరించి ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన భక్తురాలు

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో మరోసారి అపచారం జరిగింది. అంతరాలయంలో అమ్మవారి వీడియోలను చిత్రీకరించి ఇన్‌స్టాలో పెట్టడంతో సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతుంది. అంతకీ ఈ అపచారం చేసిందేవరు అన్న విషయంపై అధికారులు అరా తీస్తున్నారు.

Durga Temple: మరో వివాదంలో దుర్గమ్మ ఆలయం.. అంతరాలయంలోని అమ్మవారిని చిత్రీకరించి ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన భక్తురాలు
Kanaka Durga Temple
Follow us

|

Updated on: Jan 04, 2023 | 10:21 AM

నిత్యం వివాదాలకు కేరాఫ్‌గా ఉండే బెజవాడ దుర్గమ్మ ఆలయం మరో వివాదంలో చిక్కుకుంది. అత్యంత పవిత్రమైన అంతరాలయంలోని అమ్మవారి వీడియోలను చిత్రికరించి ఇన్‌స్టాగ్రాం లో పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారయి. వీడియోల చిత్రీకరణ వ్యవహారంలో ఆలయ యంత్రాంగం కదిలింది. సీసీటీవీ ఫుటేజీల ద్వారా వీడియోలు తీసింది ఎవరో గుర్తించారు. శాంతకుమారి అనే భక్తురాలు వీడియోలు చిత్రీకరించినట్లు గుర్తించామని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్ 22న ఉ.9.52 గంటలకు భక్తురాలు చిత్రీకరించినట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణపై ఫిర్యాదు చేశామని ప్రకటించారు. దుర్గగుడిలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేసినట్టు భ్రమరాంబ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన బెజవాడ దుర్గమ్మ అంతరాలయం వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఘటన  వెలుగుచూసింది. అమ్మవారి మూలవిరాట్‌ను ఎవరో వ్యక్తులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టారు. కనకదుర్గ టెంపుల్‌ ఐడీలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఆలయ ఆవరణతోపాటు అంతరాలయంలోని అమ్మవారి వీడియోలు వెలుగు చూశాయి. సిబ్బంది సహకారంతోనే ఇదంతా జరిగివుండొచ్చనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు భక్తులు. కాగా అమ్మవారి వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రత ఉన్నప్పటికీ ఇలా జరగడంపై మండిపడుతున్నారు. ఈ చర్యకు పాల్పడినవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి