Kailash Mountain Mystery: కైలాస పర్వత రహస్యం ఏంటి..! శివుడు నిజంగానే అక్కడ ఉన్నాడా..?

|

Sep 12, 2021 | 3:32 PM

Kailash Mountain Mystery: కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. దీనిని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు. ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి.

Kailash Mountain Mystery: కైలాస పర్వత రహస్యం ఏంటి..! శివుడు నిజంగానే అక్కడ ఉన్నాడా..?
Kailash Mountain Mystery
Follow us on

Kailash Mountain Mystery: కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. దీనిని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు. ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి. కైలాస పర్వతం టిబెట్‌ పీఠభూమి నుంచి 22,000 అడుగుల దూరంలో ఉంటుంది. దీనిని చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది. సముద్ర మట్టానికి దాదాపు 6,656 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇప్పటి వరకు టిబెట్‌లోని కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేదు. బౌద్ధ, హిందూ మత గ్రంథాల ప్రకారం.. కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు, గుహలు ఉన్నాయని చెబుతారు.

వీటిలో పవిత్ర రుషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట. కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరు. హిందువులు కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసంగా పరిగణిస్తారు. అతను తన భార్య పార్వతి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్లు చెబుతారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు పవిత్ర కైలాస పర్వత యాత్ర కోసం టిబెట్‌లోకి ప్రవేశిస్తారు. కానీ కొద్ది మంది మాత్రమే పవిత్ర శిఖరం ప్రదక్షిణను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కొంతమంది శిఖరం అధిరోహించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు.

కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ చేయడాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు. ఎందుకంటే పర్వతం పవిత్రకు, అక్కడ నివసించే దైవ శక్తికి భంగం కలుగుతుందని వారి నమ్మకం. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు.ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ చేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటోంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్‌చొక్ ( బుద్ధుని ఉగ్రరూపం) ను బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. దీనినే ధర్మపాలగా పిలుస్తుంటారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తుంటారు. తొలి తీర్థాంకరులు ఇక్కడే నిర్వాణం పొందారని జైన మతస్థుల నమ్మిక. గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెప్తుంటారు.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‏డేట్.. సక్సెస్‏ఫుల్‏గా సర్జరీ కంప్లీట్..

Sai Dharam Tej Accident: తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లకు క్లారిటీ ఇచ్చిన నరేష్.. ఏమన్నారంటే

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ బైక్‌ ప్రమాదంపై ప్రెస్ నోట్ విడుదల చేసిన పోలీసులు..