Sai Dharam Tej Accident: తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లకు క్లారిటీ ఇచ్చిన నరేష్.. ఏమన్నారంటే

టాలీవుడ్ హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి వైద్యానికి స్పందిస్తున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు

Sai Dharam Tej Accident: తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లకు క్లారిటీ ఇచ్చిన నరేష్.. ఏమన్నారంటే
Naresh

Sai Dharam Tej Accident:  టాలీవుడ్ హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి వైద్యానికి స్పందిస్తున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యారని తెలిసి అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు శ్రేయోభిలాషులు ఆందోళన పడ్డారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు నరేష్ స్పందించిన తీరుపై పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై నరేష్ స్పందిస్తూ.. ”సాయి ధరమ్ తేజ్ నా బిడ్డలాంటివాడు. తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు – సాయి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా ఉంటారు. నిన్న సాయంత్రం వాళ్లిద్దరూ ఇక్కడి నుంచే బయలుదేరారు. బైక్ పై స్పీడ్‌గా వెళ్లొద్దని చెప్పాలనుకుని బయటకు వచ్చేసరికే.. వాళ్లు వెళ్లిపోయారు. నాలుగు అయిదు రోజుల క్రితం కూడా వీళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నాను. కానీ కుదరలేదు. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, కోమటి రెడ్డి కుమారులు బైక్ రేసింగ్ వల్ల తమ కుటుంబాలను శోకం లో ముంచారు పెళ్లి, కెరీర్ తో జీవితంలో సెటిల్ కావాల్సిన వయసు ఇది. ఇలాంటి సమయంలో ఈ విధమైన రిస్క్‌లు తీసుకోకుండా ఉండటమే మంచిది. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తులను నరేష్ ప్రస్తావించడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై బండ్లగణేష్, హీరో శ్రీకాంత్,  నట్టికుమార్ ఇలా పలువురు నరేష్‌ను తప్పుబట్టారు. అయితే  తాజాగా ఈ వివాదం పై నరేష్ క్లారిటీ ఇచ్చారు.

తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో నరేష్ దీనిపై వివరణ ఇచ్చారు. ”నేను ఉదయమే సాయితేజ్ గురించి ప్రార్థించాను. చాలా ఫాస్ట్ గా రికవరీ అవుతున్నాడు. త్వరలో సాధారణ స్థితికి వస్తాడు. నేను వీడియోలో స్పష్టంగా చెప్పాను. వీళ్లిద్దరూ కలిసి బయలుదేరిన మాట వాస్తవం. ఇద్దరూ ఓ చాయ్ దుకాణం ఓపెనింగ్ కి వెళ్లారు. ఆ తర్వాత ఎవరికి వారు తిరిగి వచ్చేటప్పుడు రోడ్డుపై ఉన్న మట్టి కారణంగా జారి ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో 60-70 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నట్టు సీసీ టీవీ ఫుటేజీ చూస్తే తెలుస్తోంది. ఇది నిర్లక్ష్యం కాదు.. కేవలం ప్రమాదం మాత్రమే. ప్రమాదాలు జరుగుతుంటాయి. బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప మరో ఆలోచన లేదు. సాయి క్షేమంగా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సాయి తేజ యాక్సిడెంట్ పై నేను కాంట్రవర్సీ చేయడం లేదు.. రాజకీయం అసలు మాట్లాడటం లేదు. చిరంజీవి మేము మద్రాస్‌లో కలిసే ఉన్నాం. మా రెండు కుటుంబాల మధ్య చాలా ఆత్మీయ బంధం ఉంది. సాయి కోలుకుని ఇంటికి వచ్చాక వెళ్లి కలుస్తాను. చిరంజీవి – నాగబాబుతో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను అని నరేశ్ అన్నారు. ఓవరాల్‌గా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లకు క్లారిటీ ఇచ్చేలా సమాధానం చెప్పారు నరేష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌ను కాపాడింది నేనే.. ఆయన హీరో అని నాకు తెలియదు: అబ్దుల్ ఫర్హాన్

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు..

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు.. అతివేగం, ర్యాష్ డ్రైవింగే కారణం..

 

Click on your DTH Provider to Add TV9 Telugu