Venkatesh’s Drushyam 2 : దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వెంకటేష్ సినిమా..?

విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయంతెలిసిందే. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ...

Venkatesh's Drushyam 2 : దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వెంకటేష్ సినిమా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2021 | 1:17 PM

Venkatesh’s Drushyam 2: విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయంతెలిసిందే. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే తమిళ్ రీమేక్ నారప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు వెంకీ. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వెంకీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్ 3లో నటిస్తున్నాడు వెంకటేష్. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ను చకచకా పూర్తిచేస్తున్నాడు అనిల్. ఈ సినిమాతోపాటు దృశ్యం 2  సినిమా చేస్తున్నాడు వెంకటేష్. గతంలో వచ్చిన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు వెంకటేష్.

దృశ్యం 2 కు సురేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేసారు. అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వెంకీ దృశ్యం 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్స్టార్ కొనుగోలు చేసింది. సురేష్ బాబు- ఆంటోనీ పెరుంబవూర్- రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రావచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.  మరి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej Accident: తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లకు క్లారిటీ ఇచ్చిన నరేష్.. ఏమన్నారంటే

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు..

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు.. అతివేగం, ర్యాష్ డ్రైవింగే కారణం..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..