
సనాతన ధర్మంలో గణేశుడి ఆశీస్సులు పొందడానికి చతుర్థి తిథిని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. వేద పంచాంగం ప్రకారం భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేష్ చతుర్థి పండుగ జరుపుకుంటారు. ఈసారి గణేష్ చతుర్థి పండుగ ఆగస్టు 27న జరుపుకోనున్నారు. ఈ రోజున గణపతి బప్పకు ప్రత్యేక పూజలు చేసే సంప్రదాయం ఉంది. వినాయక చవితి పండగను ప్రకృతి దగ్గరగా ఉండే నియమాలతో జరుపుకుంటారు. గణపయ్యకు ఇష్టమైన పువ్వులు, పత్రితో పూజ చేస్తారు. కుడుములు, పండ్లు వంటివి సమర్పిస్తారు.
ఇలా చేయడం వలన గణేశుడు ప్రసన్నం అవుతాడని.. శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. గణేష్ చతుర్థి సందర్భంగా మీ ఇంట్లో శాంతి, ఆనందం నెలకొనాలంటే ఇంట్లోని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించండి. ఈ పరిహారం చేయడం వల్ల ప్రతికూల శక్తి నాశనం అవుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో వినాయక చవితి రోజున ఏ ప్రదేశాలలో దీపాలను వెలిగించాలో ఈ రోజు తెలుసుకుందాం..
ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది
సనాతన ధర్మంలో ప్రతిరోజూ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో వినాయక చవితి సందర్భంగా సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా దీపం వెలిగించండి. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి ఆనందం, శాంతి నెలకొంటుందని నమ్ముతారు.
ఈ దిశలో దీపం వెలిగించండి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో దీపం వెలిగించడం వల్ల జీవితంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఇంటి ప్రతికూల శక్తిని నాశనం చేస్తాయి. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది. కుటుంబ సభ్యులపై లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటాయి.
అన్ని అడ్డంకులు అధిగమిస్తారు
వినాయక చవితి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ చేసి, గణపతి బప్ప విగ్రహం ముందు దీపం వెలిగించండి. మంత్రాలు జపించండి. ఇలా చేయడం వలన గణేశుడు ప్రసన్నం అవుతాడు. జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి.
ఆహారం, డబ్బుకు కొరత ఉండదు
సనాతన ధర్మంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి ఈ మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో వినాయక చవితి రోజున సాయంత్రం తులసిని పూజించి , స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. మొక్కకు ఏడు లేదా ఐదు సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ పరిహారం చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని.. ఇల్లు సిరి సంపదలతో ఉంటుందని.. తినడానికి లోటు ఎప్పుడూ ఉండదని నమ్ముతారు. ఆర్థిక సంక్షోభ సమస్య నుంచి బయటపడతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.