Vinakaya Chavithi: ఆసియాలోనే అతి పెద్ద గణపతి ఆలయం ఎక్కడ ఉంది? విశిష్టత ఏమిటంటే

దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. గణేష్ చతుర్థిని గొప్ప వైభవంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. గణపతి ఉత్సవాల సమయంలో మండపాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న గణపతి ఆలయానికి కూడా దర్శనం కోసం వెళ్తారు. అయితే మన దేశంలో వినాయకుడి మన దేశంలో మాత్రమే కాదు.. ఇతర దేశాల్లో కూడా పుజిస్తారు. అనేక దేశాల్లో వినాయక ఆలయాలున్నాయి. అయితే ఆసియాలోనే అతిపెద్ద గణపతి ఆలయం గుజరాత్‌లో ఉందని మీకు తెలుసా.

Vinakaya Chavithi: ఆసియాలోనే అతి పెద్ద గణపతి ఆలయం ఎక్కడ ఉంది? విశిష్టత ఏమిటంటే
Largest Ganesha Temple

Updated on: Aug 22, 2025 | 10:55 AM

గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలోని మహేందాబాద్‌లోని వత్రక్ నది ఒడ్డున భారీ గణేశ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కూడా సిద్ధివినాయక ఆలయం అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆలయం పరిమాణంలో ముంబైలోని సిద్ధివినాయక ఆలయం కంటే చాలా రెట్లు పెద్దది. ఈ ఆలయం భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద గణేష్ ఆలయం. ఇక్కడ 56 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహం ప్రతిష్టించబడింది.

ముంబైలోని సిద్ధివినాయక దేవాలయం కంటే ఎత్తైనది
ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం భూమి నుంచి 20 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించబడిన గణపతి విగ్రహం భూమి నుంచి 56 అడుగుల ఎత్తులో ఉంది. ముంబైలోని సిద్ధివినాయక ఆలయంతో పోల్చినట్లయితే.. ఈ లయం దాని కంటే చాలా పెద్దది. దీని నిర్మాణం, విశాలత దేశవ్యాప్తంగా దీనికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ఈ ఆలయ నిర్మాణానికి పునాది రాయి 7 మార్చి 2011న వేయబడింది.

గుజరాత్ లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు
గుజరాత్‌లో ఇప్పటికే సోమనాథ ఆలయం, అంబాజీ, అక్షరధామ్ వంటి అనేక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మహేందాబాద్‌లోని ఈ భారీ సిద్ధివినాయక ఆలయం కూడా ఈ జాబితాలో చేర్చబడింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు గణేశుడిని సందర్శించడానికి ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం గుజరాత్ ఆధ్యాత్మిక పటంలో ఒక ముఖ్యమైన ప్రదేశంగా నిలిచింది. ఈ ఆలయం ఆధ్యాత్మికతకు కేంద్రంగా మాత్రమే కాకుండా.. దీని గొప్పతనం, వాస్తుశిల్పం కారణంగా సందర్శనా స్థలంగా ప్రసిద్దిగాంచింది. ఇది భక్తులను, పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

భక్తుల విశ్వాస కేంద్రం
ఈ భారీ గణపతి ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులు అపారమైన శాంతి లభిస్తుంది. గణపతి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. గణేష్ చతుర్థి వంటి ప్రత్యేక సందర్భాలలో భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. బప్పా ఆశీస్సులు పొందడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.