కోడె మొక్కులతో భక్తుల కొంగుబంగారం వేములవాడ రాజన్న.. స్థల పురాణం, ఆలయ ప్రత్యేకతలెంటో తెలుసా..

అభిషేక ప్రియుడు, బోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు. ఇక భారత

  • Rajitha Chanti
  • Publish Date - 3:39 pm, Tue, 2 March 21
కోడె మొక్కులతో భక్తుల కొంగుబంగారం వేములవాడ రాజన్న.. స్థల పురాణం, ఆలయ ప్రత్యేకతలెంటో తెలుసా..

Vemulawada RajeshwaraSwamy Temple: అభిషేక ప్రియుడు, బోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు. ఇక భారత దేశంలో శివుడుకి ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. కాశీలో ఈశ్వరుడు స్వయంగా వెలిశాడని ప్రతీతి. అలాగే దక్షిణ భారతంలో కూడా కాశీగా వేములవాడ రాజన్న ఆలయం ప్రసిద్ధి చెందింది.. శ్రీరాజరాజేశ్వరం క్షేత్రం దక్షిణ కాశీగా పిలుస్తుంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో ఉంది. పూర్వం వేములవాడను లేములవాడ, లేంబాల వాటిక అంటుండేవారని అక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక రాజరాజేశ్వర స్వామిని రాజన్నగా పిలుస్తుంటారు అక్కడి భక్తులు.

క్షేత్రచరిత్ర/ స్థల పురాణం: పూర్వం మాళవ ప్రభువు రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించారట. చాళుక్య రాజులలో మొదటి రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు, అతని తనయుడు అరికేసరి, ఆ తర్వాత రెండో యుద్ధమల్లుడు వేములవాడ కేంద్రంగా తమ రాజ్యాన్ని పాలించారట. ఇక అందులో భద్రదేవుడి కుమారుడు మూడో అరికేసరి చివరివాడని అక్కడున్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

రాజన్న ఆలయం ప్రత్యేకత..

కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ధర్మగుండలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కోడెమొక్కు చెల్లించుకున్న తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కళ్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇకా చాలా మంది భక్తులు తమ మొక్కుగా తలనీలాలను సమర్పిస్తుంటారు. అలాగే తమ ఎత్తు బంగారాన్ని (బెల్లం) రాజన్నకు మొక్కుగా చెల్లించి.. దానిని ప్రసాదంగా పంచుతారు. ఇక్కడికి ప్రతి నెల దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు వస్తుంటారని అంచనా..

వేడుకలు.. 

ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని ఇక్కడ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా దాదాపు 3 నుంచి 4 రోజుల వరకు మహా జాతర జరుగుతుంది. కేవలం మహాశివరాత్రి సమయంలో 5-6 లక్షల మంది భక్తులు వస్తుంటారని అంచాన. ఆ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా శివ కళ్యాణోత్సవాలను కూడా బ్రహ్మండంగా జరుపుతారు. ముఖ్యంగా ఇక్కడికి దాదాపు పదివేల మంది హిజ్రాలు, 25 వేల మంది శివపార్వతులు శ్రీరామనవమి రోజున పరమేశ్వరుడుని వివాహం చేసుకుంటారు. ఇవే కాకుండా రాజన్న క్షేత్రంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు,ముక్కోటి ఏకాదశి, దసరా నవరాత్రోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. రాజన్నకు మసశివరాత్రి, ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే మహాశివరాత్రి రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి పూజ, మహాలింగార్చన చేస్తారు. ఈ వేడుకలో పాల్గోనేందుకు దంపతులతోపాటు కుటుంబసభ్యులను అనుమతిస్తారు. కళ్యాణపూజలో పాల్గొన్న భక్తులకు 20 లడ్డూలతోపాటు, భోజన వసతి కల్పిస్తారు.

ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాలు..

వేములవాడలో కేవలం రాజన్న ఆలయమే కాకుండా మరిన్ని ఆలయాలున్నాయి. అవి…. రామాలయం, అనంతపద్మనాభస్వామి ఆలయం, బాలా త్రిపురసుందరీదేవి ఆలయం, మహిషాసురమర్దిని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, బద్దీపోచమ్మ, భీమేశ్వరాలయం ఉంటాయి. ఇక ఉపాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించరు. అలాగే దర్శనానికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. అలాగే ఇక్కడ ఆలయంలో పూజలకు ఆన్ లైన్ సౌకర్యం లేదు. అలాగే దేవతామూర్తులు పూజలు, టికెట్లు, పల్లకిసేవలు, పెద్ద సేవలు, కళ్యణాలు ఉన్నాయి. ఇక ఆలయంలో మాస శివరాత్రికి మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం, మహాలింగార్చన, ఆరుద్ర నక్షత్రం రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రదోశ పూజ.. పునర్వసు నక్షత్రం రోజున మహాన్యాసపూర్వ ఏకాదశ రుద్రాభిషేకం,, ఉపఆలయాల్లో సదస్యం, రేవతి నక్షత్రం రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉపాలయంలో సదస్యం నిర్వహించబడతాయి.

ప్రత్యేక రోజులలో జరిగే పూజలు..

ఉగాది రోజున నవరాత్రులు, శ్రీరామనవమి రోజున కళ్యాణోత్సవం, ఆషాఢమాసంలో తొలి ఏకాదశి పూజలు నిర్వహిస్తారు. అలాగే శ్రావణమాసంలో గోకులాష్టమి ఉత్సవాలు జరుపుతారు. వినాయకచవితికి నవరాత్రి ఉత్సవాలు, దసరాకు దేవినవరాత్రి ఉత్సవాలు, దీపావళికి లక్ష్మీపూజ, కార్తీక పౌర్ణమికి ద్వాదశి తులసీ కళ్యాణం, వైకంఠ చతుర్ధసికి మహాపూజ, పొన్నసేవ నిర్వహిస్తారు. అలాగే మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన, ఫాల్గుణ మాసంలో రాజన్నకు శివకళ్యాణం, ఐదురోజులపాటు ప్రత్యేక పూజలు.. ఆర్జిత సేవల టికెట్లను ఆన్ లైన్ సౌకర్యం లేదు.

ఆలయంలో వసతి సౌకర్యాలు..

రాజన్న సన్నిదిలోని దేవాదాయ ఆధర్వంలో దాదాపు 489 వసతిగదులున్నాయి. రాజేశ్వపురంలో ఏసీ 4 గదులున్నాయి. ఇక పార్వతిపురంలో 88 గదులు, నందీశ్వరపురం ఏసీ సూట్స్ 8 ఉన్నాయి. లక్ష్మీగణపతిపురంలో 88 గదులున్నాయి. శివపురంలో 46, శంకరపురంలో 58, భీమేశ్వర వసతి సముదాయంలో రెండు గదులు, అమ్మవారి కాంప్లెక్స్ 8 గదులున్నాయి.

ఎలా వెళ్లాలంటే..

హైదరాబాద్ నుంచి వేములవాడ దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడకు వెళ్లేందుకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇవి సిద్ధిపేట, సిరిసిల్ల మీదుగా టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. ప్రతి 30 నిమిషాలకొక బస్సు ఉంటుంది. అలాగే శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్.. అక్కడ నుంచి వేములవాడకు వెళ్లోచ్చు.

Also Read:

నమస్కారం రెండు చేతులను జోడించి ఎందుకు పెట్టాలో తెలుసా ? ఎవరెవరికి ఏ విధంగా నమస్కరించాలంటే..