ఓజీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన అందాల భామ.. ఫ్యాన్ ఫుల్ హ్యాపీ
Rajeev
19 February 2025
సౌత్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ ఎదురుచూస్తోంది అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రియాంక.
తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది. చివరిగా నాని సరిపోదా శనివారం సినిమాతో హిట్ అందుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
అయితే ఈ నటి ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది.
సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. నెటిజన్స్ ఈ అమ్మడి ఫొటోలకు తెగ లైక్స్ కొడుతున్నారు.
తాజాగా ప్రియాంక ఓజీ మూవీ అప్డేట్ ఇచ్చింది. షూటింగ్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉందని.. పవన్ లాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కల అంటూ చెప్పుకొచ్చింది.