పట్టణ జీవితంలో ఇల్లు విశాలంగా ఉండడం.. ఇంటి చుట్టూ ఖాళీ గా స్థలం .. అందులో నచ్చిన పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుకోవడం అన్నది ఒక కల.. చాలా అతి తక్కువ మందికి మాత్రమే వీలు అవుతుంది. ఎక్కువ మంది నగరాల్లో అపార్ట్ మెంట్ లోనే జీవించాల్సిన పరిస్థితి. దీంతో తమకు నచ్చిన మొక్కలు పెంచుకోవడం అంటే కొంచెం కష్టమైన పనే.. అయితే ఇండోర్ ప్లాంట్స్ ను పెంచుకోవడానికి ఆసక్తిని ఎక్కువ మంది చూపిస్తున్నారు. అందం కోసం, లేదా గాలి నాణ్యత పెరగడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఇన్తిలొ౦ మొక్కలను పెంచుకోవాలని.. ఇలా చేయడం వలన మానసిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. ఇప్పుడు ఎక్కువ మంది తమ ఇంటి స్థలానికి అనుగుణంగా మొక్కలను పెంచుకుంటుండగా.. అపార్ట్ మెంట్ లో జీవించేవారికి బాల్కనీ మొక్కలు పెంచుకునే సాధారణ ప్రదేశంగా మారిపాయింది.
టీ తాగుతున్నప్పుడు లేదా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి బాల్కనీ విశ్రాంతి తీసుకోవడానికి, కూర్చుని వార్తాపత్రికలు చదవడానికి బెస్ట్ ఎంపిక. ఇలా ఇక్కడ కూర్చుని ప్రకృతిని ఆస్వాదించే సమయంలో చుట్టూ మొక్కలు ఉండటం రిఫ్రెష్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే బాల్కనీలో మొక్కలను ఉంచడానికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. వీటిని గుర్తుంచుకోవాలని వాస్తు శాస్త్రంలో సూచించారు. ఏ దిశలో బాల్కనీ ఉంటే.. ఎ రకమైన మొక్కలు పెంచుకోవడం శుభప్రదం ఈ రోజు తెలుసుకుందాం..
బాల్కనీ తూర్పు దిశలో ఉంటే ఏమి చేయాలంటే
బాల్కనీ తూర్పు దిశలో ఉన్నట్లయితే ఈ దిశలో తులసి మొక్కను పెంచుకోవడం మంచిది. అంతేకాదు ఈ దిశలో బాల్కనీ ఉంటే బంతి పువ్వుల వంటి కొన్ని పూల మొక్కలను కూడా ఉంచవచ్చు. బంతి పువ్వు మొక్కలు అయితే వాటిని ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేయడం వలన పిల్లల కెరీర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని విశ్వాసం.
బాల్కనీ ఉత్తర దిశలో ఉంటే ఏమి చేయాలంటే
ఇంటి బాల్కనీ ఉత్తర దిశలో ఉంటే.. ఈ దిశలో జ్యోతిష్కుడి చెప్పిన ప్రకారం చిన్న మొక్కలు చాలా సరైనవిగా పరిగణించబడుతున్నాయి. వివిధ ప్రయోజనాల కోసం మనీ ప్లాంట్ లేదా క్రాసులా ప్లాంట్‌ని ఎంచుకోవచ్చు.
బాల్కనీ పశ్చిమ దిశలో ఉంటే ఏమి చేయాలంటే
బాల్కనీ పశ్చిమ దిశలో ఉన్నట్లయితే మీడియం సైజులో ఆకుపచ్చని మొక్కలను పెంచుకోవాలి. ఈ మొక్కల ఎత్తు 2-4 అడుగుల మధ్య ఉండేలా చూసుకోవాలి. ఈ దిశలో బాల్కనీలో చిన్న మొక్కలను ఉంచినట్లయితే అది ఎటువంటి ప్రయోజనాలను లేదా ఫలితాలను ఇవ్వదని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ దిశలో పెద్ద మొక్కలను పెంచితే శనిశ్వరుడి ప్రభావం బలపడుతుంది.
బాల్కనీ దక్షిణ దిశలో ఉంటే ఏమి చేయాలంటే
దక్షిణ దిశలో బాల్కనీల ఉన్నట్లు అయితే ఈ దిశలో పెద్ద, భారీ మొక్కలను ఉంచడం మంచిది. బౌగెన్‌విల్లా, బ్లాక్ ఫికస్, పామ్ ట్రీ వంటి కొన్ని తీగలను ఎంచుకోవచ్చు. అదే సమయంలో ఈ మొక్కలు మీ బాల్కనీని అందంగా కనిపించేలా చేస్తాయి. మీ గౌరవాన్ని కూడా పెంచుతాయి.
బాల్కనీలో ఉంచకూడని మొక్కలు
కొన్ని మొక్కలను బాల్కనీలో ఉంచకూడదు. బాల్కనీ ఏ దిశలో ఉన్నా కాక్టస్ లేదా రబ్బరు మొక్కను బాల్కనీలో ఉంచకూడదు. దీనితో పాటు ఏదైనా మొక్క ఎండిపోతే మీరు దానిని వెంటనే అక్కడ నుంచి తొలగించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.