AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంటి బాత్ రూమ్ ఎలా ఉండాలో తెలుసా.. లేదంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..!

Vastu Tips: వాస్తు శాస్త్రం జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఇందులోని నియమాలు అగ్ని, నీరు, గాలి మధ్య సమతుల్యతను సాధించడానికి పని చేసే సూర్య కిరణాలపై ఆధారపడి ఉంటాయి.

Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంటి బాత్ రూమ్ ఎలా ఉండాలో తెలుసా.. లేదంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..!
Bathroom
Shiva Prajapati
|

Updated on: Dec 11, 2021 | 9:35 AM

Share

Vastu Tips: వాస్తు శాస్త్రం జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఇందులోని నియమాలు అగ్ని, నీరు, గాలి మధ్య సమతుల్యతను సాధించడానికి పని చేసే సూర్య కిరణాలపై ఆధారపడి ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలోని వ్యక్తులు పురోగమిస్తారు. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, ఆశీర్వాదాలు ఉంటాయి.

వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో బాత్రూమ్ ఎలా ఉండాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. వాస్తవానికి.. బాత్రూమ్(స్నానపుగదులు) ఇంట్లో ముఖ్యమైన భాగం. ఈ ప్రదేశంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు బాత్రూమ్‌ని వాస్తు ప్రకారం నిర్మిస్తే.. మీ ఇంట్లో వాతావరణం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది.

ఇంట్లో బాత్రూమ్ ఎలా ఉండాలంటే.. 1. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ బాత్రూమ్ ఏరియా ఉండకూడదు. బాత్రూమ్‌లోని టాయిలెట్ సీటు ఎల్లప్పుడూ పశ్చిమం లేదా వాయువ్య దిశలో ఉండాలి. 2. బాత్రూమ్‌ను దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేయకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఇది ఇప్పటికే మీ ఇంట్లో దక్షిణ దిశలో నిర్మించినట్లయితే.. బాత్రూమ్ సమీపంలో ఏదైనా నల్లటి వస్తువును ఉంచండి. తద్వారా దాని ప్రతికూల ప్రభావం ముగుస్తుంది. 3. దక్షిణ దిశ అగ్ని మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ దిశలో బాత్ టబ్, షవర్ ఉంచవద్దు. బాత్రూమ్‌కు పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగును ఎంచుకోండి. గోధుమ, తెలుపు రంగులు బాత్రూమ్ కోసం మంచిగా పరిగణించబడతాయి. 4. వాస్తు ప్రకారం.. బాత్రూమ్‌లో తప్పనిసరిగా నీలిరంగు టబ్ లేదా బకెట్ ఉంచాలి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది. నలుపు, ఎరుపు రంగుల బకెట్లు లేదా టబ్‌లను ఉపయోగించవద్దు. 5. బాత్రూమ్‌లో టాయిలెట్ సీట్ కనిపించని విధంగా అద్దం పెట్టండి. అలాగే బాత్రూమ్ శుభ్రతపై పూర్తి శ్రద్ధ వహించండి. 6. బాత్రూమ్ కుళాయిలు నుంచి నీరు లీక్ అవకుండా చూసుకోవాలి. కుళాయి నుండి నీరు కారడం మంచిది కాదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు. 7. బాత్రూమ్ తలుపులు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. ఇనుప తలుపులకు బదులుగా చెక్క తలుపులను ఏర్పాటు చేయండి. బాత్రూమ్ తలుపులపై దేవుళ్లు, దేవతల చిత్రాలను ఉంచవద్దు. ఈ తలుపులను ఎప్పుడూ మూసి ఉంచాలి. 8. ప్రతి బాత్రూమ్‌కి కిటికీ ఉండాలి. తద్వారా సరైన వెంటిలేషన్ ఉంటుంది. ప్రతికూల శక్తి బయటకు వెళుతుంది. కిటికీ తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి.

Also read:

Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్‌ స్టార్‌.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..

Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..