Vastu Tips: పిరమిడ్‌తో ఇంట్లో వాస్తు దోషాలకు చెక్.. దాని ప్రయోజనాలేంటో ఇప్పుడే తెలుసుకోండి..

Vastu Tips: వాస్తు శాస్త్రంలో.. ఇంట్లో సానుకూలతను పెంచడానికి, ప్రతికూలతను తొలగించడానికి అనేక ప్రత్యామ్నాయాలు, చర్యలు ఉన్నాయి. అలాంటి వాటి ప్రత్యామ్నాయాల్లో

Vastu Tips: పిరమిడ్‌తో ఇంట్లో వాస్తు దోషాలకు చెక్.. దాని ప్రయోజనాలేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Follow us

|

Updated on: Feb 06, 2022 | 4:38 PM

Vastu Tips: వాస్తు శాస్త్రంలో.. ఇంట్లో సానుకూలతను పెంచడానికి, ప్రతికూలతను తొలగించడానికి అనేక ప్రత్యామ్నాయాలు, చర్యలు ఉన్నాయి. అలాంటి వాటి ప్రత్యామ్నాయాల్లో పిరమిడ్ కూడా ఒకటి. ఇంట్లో పిరమిడ్ ఉంటే మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఇంట్లో పిరమిడ్ ఉండటం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం…

1. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పిరమిడ్లు ఉంటే మంచిదని భావిస్తారు. ఇంట్లో పిరమిడ్ ఉంచడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. అయితే, ఇంటి సభ్యులు ఎక్కువ సమయం గడిపే ప్రదేశంలో ఈ పిరమిడ్‌ను ఉంచడం ద్వారా ప్రయోజనం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 2. పిరమిడ్ చాలా శక్తి వంతమైనది. బాగా అలసిపోయిన వ్యక్తి పిరమిడ్ దగ్గర లేదా పిరమిడ్ ఆకారంలో ఉన్న ఆలయంలో కొంత సమయం పాటు కూర్చుంటే వారిలో అలసత్వం అంతా పోయి.. సరికొత్త ఎనర్జీ శరిరంలో జనిస్తుంది. అంతేకాదు.. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. 3. వాస్తు శాస్త్రం ప్రకారం.. పిరమిడ్‌ను ఉత్తరం వైపు ఉంచడం వల్ల సంపద, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది ఆర్థిక సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. అలాగే మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుంది. 4. పిరమిడ్ మన శరీరానికి కొత్త శక్తిని ఇవ్వడంతో పాటు.. ఏకాగ్రతను పెంచుతుంది. తద్వారా ఏదైనా పని మొదలు పెడితే.. శ్రద్ధగా పని పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలు చదువుకునే టేబుల్‌పై స్ఫటిక పిరమిడ్‌ను పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఈ పిరమిడ్ కారణంగా పిల్లల్లో ఏకాగ్రత పెరిగి శ్రద్ధగా చదువుకోగలుగుతారు. 5. ఇంట్లో వెండి, ఇత్తడి లేదా రాగితో కూడిన పిరమిడ్‌ను ఉంచడం ఉత్తమమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అంత ఖరీదైన పిరమిడ్‌ను కొనుగోలు చేయలేకపోతే, చెక్కతో చేసిన పిరమిడ్‌ను కూడా ఇంట్టో ఉంచవచ్చు. 6. ఇనుము, అల్యూమినియం లేదా ప్లాస్టిక్‌తో చేసిన పిరమిడ్‌ని ఎప్పుడూ ఇంట్లో పెట్టవొద్దు. అలాగే, పిరమిడ్ చిత్రాలు కూడా ఇంట్లో ఉంచొద్దు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also read:

Hotel Room: హోటల్ గదిని తక్కువ రేటులో బుక్ చేసుకోవడం ఎలా?

Lata Mangeshkar: అత్యంత మధురమైన గాత్రం లోకాన్ని వీడడం చాలా బాధాకరం: ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్

Hair Care Tips: కరోనాతో జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. ఒత్తైన జుట్టుకోసం అమ్మకాలం నాటి ఈ చిట్కాలు పాటించి చూడండి..