Hair Care Tips: కరోనాతో జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. ఒత్తైన జుట్టుకోసం అమ్మకాలం నాటి ఈ చిట్కాలు పాటించి చూడండి..

Home Made Hair Care Tips: ఆడవారు సహజంగానే అందంగా కనిపించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా ముఖం, జుట్టు విషయంలో ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఆడవారికి..

Hair Care Tips: కరోనాతో జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. ఒత్తైన జుట్టుకోసం అమ్మకాలం నాటి ఈ చిట్కాలు పాటించి చూడండి..
Home Made Hari Growth Tips
Follow us
Surya Kala

|

Updated on: Feb 06, 2022 | 3:26 PM

Home Made Hair Care Tips: ఆడవారు సహజంగానే అందంగా కనిపించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా ముఖం, జుట్టు విషయంలో ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఆడవారికి అందాన్నిచ్చేది జుట్టు. అందుకే జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందంగానే ఉందంటారు. అయితే వాతావరణ కాలుష్యం, తినే ఆహారంలో పోషకాల లోపం ఇవన్ని కలిసి జుట్టుపై ప్రభావం చూపిస్తున్నాయి. ఎక్కువ మంది తమ జుట్టు ఊడిపోతుంది అంటూ భాదపడుతునే ఉన్నారు ముఖ్యంగా కరోనా సోకిన వారిలో జుట్టు ఊదిపోడం అధికమైనదని బాధపడుతున్నారు. ఒత్తైన జుట్టు పెరగడానికి వంటింట్లో చిట్కాలు అధికంగా మేలు చేస్తాయి. ఈరోజు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం..

చుండ్రు నివారణకు 1 స్పూన్ మెంతి పోడి 1 స్పూన్ కుంకుడుకాయ పొడి 1 స్పూన్ పుల్లటి పెరుగు పై మూడింటిని కలిపి గంటసేపు నానబెట్టాలి. దీన్నితలకు ప్యాక్‌లా వేసి 45 నిమిషాలు వుంచి గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇది తలలో వుండే చుండ్రుని షాంపూలకంటే మెరుగ్గా నిర్మూలిస్తుంది.

పొడవైన జుట్టు కోసం అలోవేరా జెల్ ఈ – విటమిన్ కాప్సిల్స్ కొబ్బరి నూనె ఆముదం అలోవెరా జెల్‌ని తీసుకుని జుట్టుకి పట్టించి నెమ్మదిగా ఓ అయిదు నిమిషాలపాటు మర్దనా చేయాలి. ఆ తరువాత మరో బౌల్‌లో ఈ-విటమిన్ కాప్సిల్‌లో ఉండే ఆయిల్‌ని తీసుకుని అందులో 1 స్పూన్ ఆముదం, 2 స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా వేడి నీరు కూడా జత చేయాలి. దీన్ని తలకు పట్టించి 5 నిమిషాలపాటు మర్దనా చేయాలి. ఇలా మళ్లీ ఒకసారి చేయాలి. ఓ గంట సేపు ఉంచి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 4,5 సార్లు చేస్తే జుట్టు మృదువుగా ఉండడమే కాకుండా, పొడవుగా పెరుగుతుంది.

తెల్ల జుట్టుని నల్లగా మార్చే చిన్న చిట్కా 4 స్పూన్ల ఉసిరిపొడి 4 స్పూన్ల కుంకుడుకాయ పొడి 4 స్పూన్ల శీకాయపొడి పై మూడింటిని రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. దీనికి ఉదయాన్నే 4 స్పూన్ల గోరింటపొడి కలిపి రెండు మూడు గంటలు నానబెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదు వీటితో పాటు మంచి పోషకాహారం కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది.

Also Read:   చిట్టి చిట్టి ఆవాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి..