Mustard Seeds: చిట్టి చిట్టి ఆవాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి..

Mustard Seed Benefits:భారతీయ వంటిల్లే ఓ ఔషధాల గని. ప్రతి ఇంట్లో ఉండే పోపుల పెట్టెలో ఉండే పోపు దినుసులు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిల్లో ఒకటి ఆవాలు. ఇవి..

Mustard Seeds: చిట్టి చిట్టి ఆవాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి..
Mustard Seeds Benefits
Follow us

|

Updated on: Feb 06, 2022 | 2:59 PM

Mustard Seed Benefits:భారతీయ వంటిల్లే ఓ ఔషధాల గని. ప్రతి ఇంట్లో ఉండే పోపుల పెట్టెలో ఉండే పోపు దినుసులు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిల్లో ఒకటి ఆవాలు. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. అయితే ఈ ఆవగింజ కొండంత మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌ ఎక్కువగా లభిస్తాయి. ఈరోజు ఆవాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నిటి గురించి తెలుసుకుందాం..

*ఆవాల్లోని విటిన్ ఏ , ఐరన్ , ఫ్యాటీ యాసిడ్లు జుట్టు దట్టంగా పెరగడానికి తొడ్పడతాయి. *ఆవాల్లో ఉండే ఫోటోన్యూట్రియెంట్ గుణాలు, పీచుపదార్ధాల కారణంగా అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లకు నివారిస్తాయి. మలబద్దకం కూడా తగ్గుతుంది. *ఆవాలు రక్తపోటును సమర్ధంగా తగ్గిస్తాయి *ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్ ఎక్కువ. వాటి యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి. *ఆవాల్లోని నియాసిన్ వంటి పోషకాల వల్ల కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గుతాయి. రక్తనాళాల్లో పాచిలాగ పేరుకునే అథెరోస్క్లిరోసిస్ వంటి కండిషన్లను ఆవాలు నివారిస్తాయి. *ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతో పాటు జలుబు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి. * ఆవాలు బరువు తగ్గడానికి బాగా తొడ్పడతాయి. ఆవాలలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఎక్కువ . దాంతో వ్యాధి నిరోధక శక్తి సమకూరడమే కాకుండా, జీవక్రియలు సమర్ధంగా జరుగుతాయి. *ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స, ల్యూటిన్ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే అనర్ధాలను తగ్గించి దీర్ఘకాలం యౌవనంగా ఉంటటానికి తొడ్పడతాయి.

Also Read:   మోదీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌నపై టీఆర్ఎస్-బీజేపీ నేత‌ల యుద్ధం..ఈక్వాలిటీ మీద కేటిఆర్ ట్వీట్ వైరల్..