Vastu Tips: మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా?.. అయితే ఎప్పటికీ మిమ్మల్ని అదృష్టం వరించదు.. ఎందుకంటే..!
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం ప్రతికూల వాతావరణాన్ని తీసుకువస్తుంది. అవి కుటుంబ అభివృద్ధికి నిరోధకంగా ఉంటాయి. సంపద రాకకు
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం ప్రతికూల వాతావరణాన్ని తీసుకువస్తుంది. అవి కుటుంబ అభివృద్ధికి నిరోధకంగా ఉంటాయి. సంపద రాకకు ఆటంకం కలిగిస్తాయి. అందుకని, ప్రతికూల వాతావరణానికి కారణమైన వస్తువులను ఇంట్లో నుంచి తీసువేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు చసూచిస్తున్నారు.
డస్ట్‌బిన్: చాలా మంది డస్ట్‌బిన్‌ను ఇంటి లోపల ఉంచుతారు. కానీ దానిని ఎప్పుడూ ఇంటి లోపల ఉంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను తీసుకువస్తుంది. డస్ట్‌బిన్‌ను ఎప్పుడూ ఇంటి బయటే ఉంచాలి. ఒకవేళ మీరు దానిని ఇంటి లోపల ఉంచినట్లయితే, మూత పెట్టి ఉంచాలి.
పాత వస్తువులు: పాత వస్తువులను పడేసేందుకు చాలా మంది విముఖత వ్యక్తం చేస్తుంటారు. పాత చిరిగిన బట్టలు, విరిగిన వస్తువులు, తుప్పు పట్టిన వస్తువులను కూడా తమ వద్దే ఉంచుకుంటారు. అయితే, అలాంటి వాటిని వీలైనంత త్వరగా పడేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. పాత వస్తువులు మీ అభివృద్ధికి ఆటంకంగా మారడమే కాకుండా.. మీ అదృష్టాన్ని అడ్డుకుంటుందట.
ఇండోర్ ప్లాంట్స్: ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఇళ్లలో ఇండోర్ ప్లాంట్స్‌ను పెడుతుంటారు. అయితే, ఎండిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచకూడదు. ఒకవేళ మొక్కలు ఎండిపోతే.. వెంటనే వాటిని తీసివేయాలి. ఎండిన మొక్కలు చెడుకు సంకేతం అని చెబుతుంటారు. కుటుంబ పురోగతి, శ్రేయస్సు, సంపదలో అడ్డంకులు సృష్టిస్తుందట.
ఇంటి పైకప్పుపై చెత్త: చాలా మంది ఇంటిని శుభ్రంగా ఉంచుతారు. కానీ, ఇంట్లోని అన్ని పనికిరాని వస్తువులను పైకప్పుపై వేస్తారు. వాస్తు ప్రకారం, పైకప్పుపై ఉంచిన వ్యర్థాలు ఇంట్లో ప్రతికూలతను తెస్తాయి. దీని కారణంగా ఇంట్లో కష్టాలు, విద్వేషాలు ఏర్పడతాయి. ఏ పని చేపట్టినా నిష్ర్పయోజనంగా మారుతుంది. కాబట్టి వెంటనే పనికిరాని వస్తువులను ఇంటి పైకప్పుపై ఉంచకుండా చర్యలు తీసుకోవాలి.
Also read:
Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!
Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!