Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా తాబేలుని ఈ దిశలో పెట్టుకోండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..

|

Feb 10, 2024 | 12:39 PM

తాబేలు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని ఇంట్లో ఉంచడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే  తాబేలును ఇంట్లో పెంచుకోవడం కష్టం కనుక లోహంతో చేసిన తాబేలును తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ రోజు తాబేలు అదృష్టాన్ని తెస్తుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. అది ఏమిటో తెలుసుకుందాం.. 

Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా తాబేలుని ఈ దిశలో పెట్టుకోండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
Vastu Tips For Tortoise
Follow us on

జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం రెండింటిలోనూ తాబేలు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తాబేలు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది. విశ్వాసాల ప్రకారం విష్ణువు కూర్మ రూపంలో అవతరించాడు. అందుకే తాబేలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని చెబుతారు. తాబేలు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని ఇంట్లో ఉంచడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే  తాబేలును ఇంట్లో పెంచుకోవడం కష్టం కనుక లోహంతో చేసిన తాబేలును తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ రోజు తాబేలు అదృష్టాన్ని తెస్తుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. అది ఏమిటో తెలుసుకుందాం..

  1. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోహంతో చేసిన తాబేలు కోరికలను తీర్చగలదు. తాబేలును ఉత్తర దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కోరిక త్వరలో నెరవేరుతుందని నమ్ముతారు.
  2. డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య లేదా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే ఇంట్లో స్ఫటిక తాబేలు ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది డబ్బుకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.
  3. వాస్తు ప్రకారం విద్యార్థులకు చదువుపై ఆసక్తి లేకుంటే, చదువుకునే సమయంలో వారి మనస్సు లగ్నం చేయాలనుకుంటే అలాంటి విద్యార్థులు తమ స్టడీ టేబుల్‌పై ఇత్తడి లోహంతో చేసిన తాబేలును ఉంచుకోవాలి. ఇత్తడితో తయారు చేసిన తాబేలును స్టడీ టేబుల్‌పై ఉంచడం వల్ల విద్యార్థుల మనసు చదువుపైనే కేంద్రీకరిస్తారని విశ్వాసం. ఈ పరిహారం దృష్టి లోపాల నుండి కూడా రక్షిస్తుంది.
  4. కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నట్లయితే దుకాణం, ఆఫీసులో  వెండి లోహంతో చేసిన తాబేలును ఉంచండి. ఇలా చేయడం వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందని సంపద స్థిరంగా ఉంటుందని నమ్ముతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. లోహంతో చేసిన తాబేలు ఉంగరం కూడా చాలా వాడుకలో ఉంది. ఈ ఉంగరం చాలా శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. అందువల్ల ఎక్కువ మంది వేలికి తాబేలుతో చేసిన ఉంగరాన్ని ధరిస్తారు. విశ్వాసాల ప్రకారం శుక్రవారం లేదా అక్షయ తృతీయ, ధన్ తెరాస్ లేదా దీపావళి లేదా పవిత్రమైన రోజులలో లోహంతో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం సొంతం అవుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు