Vastu Tips: ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా..? అయితే, ఈ వాస్తు చిట్కాలు తెలుసుకోండి..

|

May 14, 2023 | 8:41 AM

ఈ వాస్తు దోషం వల్ల ఇంట్లో ఎప్పుడూ వాగ్వాదాలు, గొడవలు, కలహాలు జరుగుతుంటాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. వాస్తు దోషం వల్ల ఇంట్లో గొడవలు లేదా కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. కొన్ని వాస్తు పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. వాస్తుకు సంబంధించిన ఈ పరిష్కారాలు..

Vastu Tips: ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా..? అయితే, ఈ వాస్తు చిట్కాలు తెలుసుకోండి..
Vastu Tips
Image Credit source: TV9 Telugu
Follow us on

వాస్తులో శక్తికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇది సానుకూల, ప్రతికూల శక్తిపై ఆధారపడి ఉంటుంది. వాస్తు ప్రకారం, శక్తి ఇంటి అంశాలు, ఇంట్లో ఉంచిన వస్తువుల నుండి కూడా పొందబడుతుంది. చాలా సార్లు వాస్తు నియమాలు పాటించకపోవడం వల్ల వాస్తు దోషాలు సంభవిస్తాయి. వాటి పర్యవసానాలను ఇంటి సభ్యులే భరిస్తుంటారు. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో గందరగోళాన్ని తగ్గించే కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకుందాం.

మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే తప్పకుండా మీ ఇంట్లో బుద్ధుని విగ్రహాన్నిపెట్టుకోండి. బుద్ధుడు శాంతి, సామరస్యాన్ని సూచిస్తాడు. బుద్ధుని బొమ్మ ఉన్న గదిలో ఎప్పుడూ శాంతి ఉంటుంది. బుద్ధిడి బొమ్మను మీ మెయిన్‌ హాల్‌లో పెట్టుకోవటం మంచిది. ఇంట్లో పగిలిన గాజు వస్తువులు ఉంటే వెంటనే తొలగించండి. అద్దాలు జీవితాలను మార్చగలవు. మీ ఇంట్లో వీలైనన్నీ ఎక్కువ అద్దాలను అమర్చుకోండి. ఇది ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీని కూడా అందిస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వల్ల గొడవలు తగ్గుతాయి. ఈ అద్దాన్ని ఎప్పుడూ ఉత్తర మూలలో ఉంచాలని గుర్తుంచుకోండి.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉప్పు అన్ని రకాల ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. మీరు మీ గదిలో ఒక మూలలో ఒక చిన్న గిన్నెలో రాతి ఉప్పువేసి ఉంచుకోవచ్చు. ఫలితంగా, ఇల్లు కలహాలు, ఇబ్బందులను తొలగిస్తుంది. సానుకూల శక్తిని నిర్వహిస్తుంది. ప్రతి నెల దాన్ని మార్చండి. ఇది కుటుంబంలో ఆనందం, శాంతిని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంట్లో వినిపించే శబ్ధాల గురించి మీరు ఆందోళన చెందుతుంటే మీ కిటికీలో క్రిస్టల్ విండ్ చైమ్‌ను ఏర్పాటు చేసుకోండి. ఇది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. అప్పుడు గాలి శబ్దం కూడా మనస్సును ప్రశాంతపరుస్తుంది. పడకగది కిటికీలో విండ్‌చైమ్ ఉంచడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

మరిన్ని వాస్తు సబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..