Tirupati: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి అరుదైన భూరి విరాళం అందింది. తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం అందించారు.. దాదాపు మూడు కోట్ల విలువ చేసే వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కఠి హస్తాలను విరాళంగా ఇచ్చారు. వీటి బరువు సుమారు 5.3 కిలోల వరకూ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే..
శ్రీవారిని దర్శించుకున్న ఓ దాత స్వామివారికి బహుమానం రూపంలో వీటిని ఇచ్చారు. వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద కఠి, హస్తాలను స్వామివారికి విరాళంగా అందజేశారు.. ఇవాళ ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఓ భక్తులు వీటిని ఆలయానికి ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఈ బంగారు కఠి, హస్తాలు దాదాపు 5.3 కిలోల బరువుంటాయి.. వీటి విలువ సుమారు మూడు కోట్లు దాకా ఉంటుంది.. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఆ భక్తులు ఈ ఆభరణాలను అందించారు ఆ భక్తుడు. అనంతరం ఆలయ అధికారులు దాతను ప్రత్యేకంగా సత్కరించారు..
ఈ ఆభరణాలను టీటీడీ అధికారులు, అర్చకులు శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.. ఈ వజ్రాలు, పెంపులు పొదిగిన బంగారు వరద-కఠి హస్తాల విలువ 3 కోట్ల రూపాయలు ఉంటుందని టీటీడీ తెలిపింది. కాగా ఈ దాత వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.. ఈ భక్తుడు చెన్నైకి చెందిన వ్యాపారి అని తెలుస్తోంది.
Also Read: ఓ ఆర్టిస్టు బిపిన్ రావత్‌కు ఘన నివాళి.. రావి ఆకుపై రావత్ కళాకృతి ..దేశ భక్తి గీతం.. వీడియో వైరల్..