AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 4 రాశులవారికి పెళ్లంటే చచ్చేంత భయం.. అందులో మీరున్నారా.?

Zodiac Signs: మనందరం కూడా పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంటాం. కొందరికి పెళ్లి చేసుకోవాలని తొందరెక్కువ ఉంటే..

Zodiac Signs: ఈ 4 రాశులవారికి పెళ్లంటే చచ్చేంత భయం.. అందులో మీరున్నారా.?
Zodiac Signs
Ravi Kiran
|

Updated on: Dec 10, 2021 | 9:52 AM

Share

మనందరం కూడా పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంటాం. కొందరికి పెళ్లి చేసుకోవాలని తొందరెక్కువ ఉంటే.. మరికొందరు ముందుగా తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని భావిస్తారు. అయితే వీరిద్దరూ కాకుండా మూడో రకం వ్యక్తులు ఉంటారు.. వారికి పెళ్లంటే చాలా భయం. వివాహాన్ని వీలైనంత ఎక్కువ కాలం వాయిదా వేయాలని చూస్తారు. వీరికి పెళ్లిని వాయిదా వేసేందుకు వివిధ రకాల కారణాలు ఉండొచ్చు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఇలాంటి వ్యక్తులు 4 రాశులకు చెందినవారు ఉన్నారట. మరి ఆ రాశులు ఏంటి.? అందులో మీరున్నారా.! అనేది తెలుసుకోండి..

కన్యారాశి:

ఈ రాశివారు పర్ఫెక్షనిస్ట్‌లు. దీని వల్ల వీరు తమ భాగస్వామి గురించి ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. అందుకే పెళ్లి విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోలేరు. వీరు తమకు నచ్చిన జీవిత భాగస్వామిని పొందటానికి చాలా సమయం పడుతుంది.

వృశ్చికరాశి:

ఈ రాశివారు చాలా మొహమాటపరులు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో తడబడతారు. ఎలప్పుడూ మనస్సులోనే ఉంచుకుంటారు. ఎదుటివారికి ఆ ఫీలింగ్‌ను తెలియనివ్వరు. ఈ స్వభావం కారణంగా వారు త్వరగా ఎవరితోనూ బంధాన్ని ఏర్పరచుకోలేరు. తమ భాగస్వామితో మనసులోని మాటను చెప్పలేమని.. అందువల్ల వివాహా బంధాన్ని కొనసాగించడం కష్టమని వారు భావిస్తారు.

ధనుస్సురాశి:

ఈ రాశివారు తమ జీవితంలో ఎలప్పుడూ సంతోషంగా ఉంటారు. వారు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రతీ పనిని సొంతంగా చేసేందుకు ఇష్టపడతారు. తమ జీవితంలో ఇతరుల జోక్యం ఉండకూడదని భావిస్తారు. అందుకే వీరికి పెళ్లంటే చచ్చంటే భయం. దీని వల్ల వీరు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు.

మీనరాశి:

ఈ రాశివారు చాలా ప్రతిభావంతులు. ప్రతీ పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. అయితే వీరు మాత్రం త్వరగా ఇతరులతో కలవలేరు. తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కూడా చాలా సమయాన్ని తీసుకుంటారు.

Also Read: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!