Tirumala News: శ్రీవారి భక్తులకు డబుల్ బొనాంజా.. ఒకేసారి రెండు నెలల టికెట్లు, అద్దె గదులు.. బీఅలెర్ట్..

|

Apr 23, 2023 | 8:59 AM

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే సారి రెండు నెలలకు సంబంధించిన రూ.300 దర్శనం టికెట్లను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది భక్తులు వస్తుంటారు.

Tirumala News: శ్రీవారి భక్తులకు డబుల్ బొనాంజా.. ఒకేసారి రెండు నెలల టికెట్లు, అద్దె గదులు.. బీఅలెర్ట్..
TTD NEWS
Follow us on

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే సారి రెండు నెలలకు సంబంధించిన రూ.300 దర్శనం టికెట్లను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది భక్తులు వస్తుంటారు. ఎలాంటి టికెట్లు లేకుండా తిరుమలకు వస్తే.. స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతుంది. టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్యదర్శనం టికెట్లు తిరుపతిలో ఇచ్చినప్పటికీ.. వాటికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల చాలా మంది భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయిస్తారు. అయితే, ఒక నెలకు సంబంధించిన రూ.300 దర్శనం టికెట్లను సాధారణంగా టీటీటీ ఆ ముందు నెల చివరి వారంలో ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అయితే, ఈ సారి మే నెలతోపాటు.. జూన్ నెల టికెట్లను కూడా ఒకేసారి విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

మే, జూన్ నెలలకు సంబధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏప్రిల్ 25న (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ టికెట్లు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ లేదా TT devasthanams యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి. మీ వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేసుకోవాలి.

దీంతోపాటు.. మే, జూన్ నెలలకు సంబంధించి తిరుమలలో అకామడేషన్ కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇవి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటులో ఉంటాయి. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎంత త్వరగా ప్రయత్నిస్తే.. అంత ఈజీగా దొరుకుతాయి. కావున శ్రీవారి భక్తులు మంగళవారం అలెర్ట్ గా ఉంటే మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..