Brahmotsavam: స్వర్ణరథంపై శ్రీవారు.. దర్శనంతో సర్వ శుభాలు సుఖాలు చేకూరుతాయని విశ్వాసం

తిరు మాడవీధులలో స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ భూదేవి కరుణతో సమస్తధాన్యాలు శ్రీవారి కరుణతో సర్వశుభాలు సుఖాలు చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం.

Brahmotsavam: స్వర్ణరథంపై శ్రీవారు.. దర్శనంతో సర్వ శుభాలు సుఖాలు చేకూరుతాయని విశ్వాసం
Tirumala Brahmotsavalu
Follow us

| Edited By: Surya Kala

Updated on: Oct 22, 2023 | 10:38 AM

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు ఉదయం స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం సాగింది. ఉద‌యం 7.15 గంటలకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌ బంగారుతేరులో పయనిస్తూ, భక్తుల్ని అనుగ్ర‌హించారు. గోవింద నామ స్మరణతో మారుమోగిన మాడవీధుల్లో కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకోగా మంగ‌ళ‌వాయిధ్యాల న‌డుమ తిరు మాడవీధులలో స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వ‌ర్ణ‌ ర‌థాన్ని లాగారు.

స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు శ్రీవారి కరుణతో సర్వ శుభాలు సుఖాలు చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం. స్వ‌ర్ణ‌ ర‌థోత్స‌వంలో తిరుమ‌ల పెద్ద‌జీయ‌ర్‌ స్వామి, చిన్న‌జీయ‌ర్‌ స్వామిలతో పాటు టిటిడి ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి దంప‌తులు, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి