AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Tirupati: శ్రీవారిని దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారా..! యాత్ర చిరస్మరణీయంగా మారాలంటే ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి..

ఇల వైకుంఠ క్షేత్రంగా విలసిల్లుతోంది. ఈ ఆలయ వైభవాన్ని, చుట్టుపక్కల పచ్చటి ప్రాంత అందాలను చూస్తే ఎవరికైనా తిరుమల కొండపైనే సెటిల్ అవ్వాలని అనిపిస్తుంది. ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా తిరుపతి క్షేత్రాన్ని దర్శించుకోవాలని.. మలయప్ప స్వామిని సందర్శించాలని కోరుకుంటారు. అయితే తిరుపతి క్షేత్రంలోని శ్రీవారి తో పాటు ఇక్కడ ఉన్న మరికొన్ని ప్రదేశాలను సందర్శించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రదేశాలను సందర్శించిన తర్వాత మీ ఆధ్యాత్మిక యాత్ర ఆధ్యాత్మికత, సాహసాల కలయికగా మారుతుంది.

Tirumala Tirupati: శ్రీవారిని దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారా..! యాత్ర చిరస్మరణీయంగా మారాలంటే ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి..
Travel Tirupati
Surya Kala
|

Updated on: Oct 16, 2024 | 5:15 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హిందువులకు విశ్వాసానికి కేంద్రంగా ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. తిరుమల వెంకన్నం, శ్రీనివాసుడు, స్వామివారి, శ్రీవారు, బాలాజీ, మలయప్ప స్వామి వంటి వివిధ పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం.

తిరుపతిలో వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఆలయ చరిత్ర మాత్రమే కాదు నగరం కూడా చాలా పాతది. శ్రీనివాసుడి ఆలయాన్ని సందర్శించాలని చాలా మంది భక్తులు కోరుకుంటారు. అయితే తిరుపతి క్షేత్రంలో శ్రీవారి ఆలయం తో పాటు ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

కొండపై ఇతర ఆలయాలు

తిరుపతి తిరుపతి ఆలయంలోని శ్రీనివసుడిని సందర్శించి.. కొండపైన పాపనాశనం, వేణుగోపాల స్వామీ ఆలయం, జపాలి వంటి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. అంతేకాదు ఇక్కడ అందమైన సహజ ప్రదేశాలలో కూడా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్

తిరుపతి శ్రీవారి దర్శనం అనంతరం వెంకటేశ్వర నేషనల్ పార్కుకు వెళ్లండి. ఈ ప్రదేశాన్ని సందర్శించడం మీకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే చుట్టూ పచ్చదనం, ప్రశాంతతతో పాటు అందమైన పక్షుల జాతులను చూడవచ్చు. అయితే ఈ ప్రదేశం మచ్చల జింకలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, చిరుతపులులు వంటి జంతువులను చూడడం మంచి అనుభూతిని ఇస్తుంది.

జింకల పార్కు దృశ్యాలు

తిరుపిట్ సందర్శించే పర్యాట ప్రాంతంలో జింకల పార్క్ కూడా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడ అందమైన జింకలను చూడటంతో పాటు నెమళ్ళు, ఇతర జంతువులు, పక్షులను కూడా చూడవచ్చు. వీటికి ఆహారం కూడా అందించవచ్చు.

ఆకాశగంగ తీర్థానికి వెళ్లండి

తిరుపతి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశగంగ తీర్థం ప్రకృతి ప్రేమికులకు గొప్ప ప్రదేశం. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పట్టణంలోని రణగొణధ్వనుల నుంచి దూరంగా శాంతిని అందించడంలో సహాయపడుతుంది. ఇక్కడ ఆకాశగంగ నదిలో కూడా స్నానం చేయడం ఒక అందమైన అనుభూతిని ఇస్తుంది.

ఈ దేవాలయాలను కూడా సందర్శించండి

తిరుపతి శీవారి ఆలయంతో పాటు గోవింద రాజు ఆలయం, కపిల తీర్థం, ప్రసన్న వెంకటేశ్వర ఆలయం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ వరాహ స్వామి ఆలయం మొదలైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. స్వామీ వారు పవిత్ర సరస్సుతో పాటు, స్వామి పుష్కరిణిలో కూడా స్నానం చేయవచ్చు. ఈ విధంగా ప్రకృతి ప్రేమికులైనా లేదా ఆధ్యాత్మిక యాత్రకు ప్లాన్ చేసినా తిరుపతిలో ఈ ప్రదేశాలను సందర్శించడం గొప్ప జ్ఞాపకంగా మిగులుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..