TTD E – Auction: వెంకన్న భక్తులకు మరో శుభవార్త.. టీటీడీకి చెందిన వస్త్రాల ఈ-వేలం. ఎలా సొంతం చేసుకోవాలంటే.

TTD E - Auction: తెలుగు వారికి.. ఆ మాటకొస్తే యావత్ దేశ వ్యాప్తంగా తిరుమల అంటే ఎంతో మందికి ఆధ్యాత్మిక భావన ఉంటుంది. ఆ ఏడు కొండల వాడిని ఎన్నిసార్లు దర్శించుకున్నా మరోసారి వెళ్లాలనే కోరిక ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. ఏడాదికి ఒక్కసారైనా...

TTD E - Auction: వెంకన్న భక్తులకు మరో శుభవార్త.. టీటీడీకి చెందిన వస్త్రాల ఈ-వేలం. ఎలా సొంతం చేసుకోవాలంటే.
Ttd E Auction

Edited By:

Updated on: Jul 09, 2021 | 8:26 PM

TTD E – Auction: తెలుగు వారికి.. ఆ మాటకొస్తే యావత్ దేశ వ్యాప్తంగా తిరుమల అంటే ఎంతో మందికి ఆధ్యాత్మిక భావన ఉంటుంది. ఆ ఏడు కొండల వాడిని ఎన్నిసార్లు దర్శించుకున్నా మరోసారి వెళ్లాలనే కోరిక ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని సందర్శించుకునే వారు మనలో చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఇక ఆ దేవదేవుడిని భక్తుల చెంతకు చేర్చేందుకు టీటీడీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇటీవలే వివాహానికి సంబంధించిన తొలి శుభలేఖను తిరులమకు పంపించేందుకు వీలుగా టీటీడీ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భక్తులు తొలి పెళ్లి కార్డును తిరుమల అడ్రస్‌కు కొరియర్‌ చేస్తే.. తిరుమల నుంచి చేతి కంకణాలు, అక్షింతలు (పెళ్లి తలంబ్రాలో కలుపుకోవచ్చు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదంను పంపుతామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా టీటీడీ ఇలాంటి మరో ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 136 లాట్ల వస్త్రాలను ఈ-వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని జులై 15 నుంచి 17వరకు ప్రభుత్వ కొనుగోలు పోర్టల్‌ ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కొత్త వస్త్రాలతో పాటు దేవతామూర్తులకు వినియోగించిన వస్త్రాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక పూర్తి వివరాలకు.. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయ 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in / www.tirumala.orgను గానీ సంప్రదించాలని తెలిపారు.

Also Read: Guntur Crime News: జోతిష్యాలయం పెట్టి మోసాలు షురూ చేశాడు.. లేడీ డాక్టర్‌ను నిండా ముంచేశాడు

Telangana Corona Cases: తెలంగాణలో కాస్త తగ్గిన పాజిటివ్ కేసులు, 24 గంటల్లో కొత్తగా ఎన్నంటే..

Pew Survey: అత్యధిక హిందువులు పూజించే దేవుడు ఎవరు ? .. అమెరికాకు చెందిన సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు