హిందూ మతంలో ప్రతి ఒక్క రోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితం చేయబడింది. అదేవిధంగా గురువారం విష్ణువుకి దేవతల గురువు బృహస్పతికి అంకితం చేయబడింది. బృహస్పతి లేదా గురుడు సౌర వ్యవస్థలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాడు. సూర్యుని తర్వాత స్థిరంగా ఉండే గురువుని విశ్వ గురువు అని కూడా అంటారు. ప్రతి గురువారం పూజ చేసిన భక్తుడు మంచి ఆరోగ్యం, సంపద, విజయం, జీవితంలో మంచి భాగస్వామిని పొందుతారని విశ్వాసం. హిందూ మతంలో చెట్లకు పవిత్ర స్థానం ఉంది. ఆలాంటి చెట్టులో ఒకటి అరటి చెట్టు. పూజా, శుభకార్యం ఏదైనా సరే అరటి చెట్టు, అరటి పండ్లు, అరటి ఆకులను ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం ప్రతి గురువారం అరటి చెట్టును పూజిస్తే వివిధ ప్రయోజనాలు పొందుతారు.
చెట్టు లేని జీవితం లేదు. కనుకనే చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. దేవుడిని పూలు, పండ్లు మొదలైన వాటితో పూజించడం వల్ల కుటుంబానికి క్షేమం చేకూరుతుందని నమ్మకం. హిందూమతంలో అరటి చెట్టు అత్యంత పవిత్రమైనది. లోక “రక్షకుడు” అయిన విష్ణువుకి చిహ్నంగా అరటి చెట్టు పరిగణించబడుతుంది. వివిధ పురాణాల ప్రకారం గురువుకు ఎటువంటి దక్షిణ చెల్లించలేని శిష్యుడు నగదు లేదా కానుకలకు బదులుగా కొన్ని అరటి చెట్లు లేదా అరటిపండ్లను ఇవ్వవచ్చు. గృహప్రవేశాలు, వివాహాలు, ఇంట్లో ఇతర సందర్భాలలో సాధారణంగా రెండు అరటి చెట్లను శుభ చిహ్నంగా ప్రవేశ ద్వారంకి ఇరువైపులా ఏర్పాటు చేస్తారు. అరటి చెట్టులోని ప్రతి భాగాన్ని ఎదోక సందర్భంలో ఏదో ఒక ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. అరటి ఆకు అత్యంత పవిత్రమైనది. అన్ని వైదిక కర్మలలో ఉపయోగించబడుతుంది. ఆహారం కోసం అత్యంత పవిత్రమైన ప్లేట్‌గా కూడా పరిగణించబడుతుంది. అందుకే నేటికీ దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అరటి ఆకులపై ఆహారాన్ని అందించే సాంప్రదాయం కొనసాగుతోంది.
గురువారం నాడు అరటి చెట్టును పూజించడం ద్వారా భగవంతుని ఆశీర్వాదంతో గృహంలో శుభశక్తి పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాదు ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రతి గురువారం అరటి చెట్టును పూజించడం వల్ల ఉద్యోగ, సామాజిక జీవితంలో కీర్తి, గౌరవం పెరుగుతాయి.
అరటి చెట్టు విష్ణుమూర్తికి ప్రతీక. అందుచేత విష్ణువు ఇంట్లో అరటి చెట్టు నాటితే ఆ గృహస్థుడిని విష్ణువు విడిచిపెట్టడు. ఫలితంగా కుటుంబంలోని ప్రతి సభ్యుని పనిలో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం పెరుగుతుంది.
శాస్త్రాల ప్రకారం ప్రతి గురువారం అరటి చెట్టును పూజించడం ద్వారా మంగళ దోషం తొలగిపోతుంది. దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయి, అలాగే వైవాహిక జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉండదు.
విష్ణువు, లక్ష్మీ దేవి, గణేశ పూజ సమయంలో అరటి ఆకులను సమర్పిస్తే, గజాననుడు చాలా సంతోషిస్తాడు. తత్ఫలితంగా జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి