Love Horoscope : ఈ మూడు రాశులవారు ప్రేమ వివాహాన్ని నమ్ముతారు.. ఇందులో మీరున్నారా..

Zodiac signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి రాశిచక్రం దాని స్వంత ప్రత్యేక లక్షణాలను, స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రేమ వివాహాన్ని విశ్వసించే ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.

Love Horoscope : ఈ మూడు రాశులవారు ప్రేమ వివాహాన్ని నమ్ముతారు.. ఇందులో మీరున్నారా..
Love Marriage
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 23, 2022 | 8:21 PM

వేద జ్యోతిషశాస్త్రంలో 12 రాశులు, 27 రాశుల గురించి వివరించబడింది. జ్యోతిష్యం లేదా జోస్యం, భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విశ్వసించే శాస్త్రం. జీవితంలో జరిగినది.. జరుగుతున్నది.. జరగబోయేదీ.. జననకాల గ్రహస్థితి ప్రకారము.. శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. ఈ సంకేతాలను ఏదో ఒక గ్రహం లేదా మరొకటి ఆదిపత్యం వహిస్తుంది. అలాగే, ఈ రాశిచక్ర గుర్తులతో సంబంధం ఉన్న వ్యక్తుల స్వభావం, భవిష్యత్తు, వ్యక్తిత్వం భిన్నంగా ఉంటాయి.

ఇక్కడ మనం అలాంటి రాశిచక్ర గుర్తుల గురించి మాట్లాడబోతున్నాం. వీరిలో ప్రజలు ప్రేమ వివాహాన్ని నమ్ముతారు. ప్రేమ వివాహం విషయంలో ఇలాంటి వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లేందుకు వాళ్లు కష్టపడాల్సిన పనిలేదు. ఈ రాశుల గురించి తెలుసుకుందాం.. 

తుల : ప్రేమ వివాహాల విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులు. అలాగే, ఈ వ్యక్తులు శృంగార స్వభావం కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ తమ భాగస్వామికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ప్రేమ పట్ల మనసులో చాలా నమ్మకం ఉంటుంది. తమ ప్రేమను పొందేందుకు ఎన్ని అడ్డంకులనైనా తెలివిగా దాటగలమని నమ్ముతారు. ఈ వ్యక్తులు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరు మంచి బట్టలు ధరించడానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులు కొంచెం ఫన్నీ, స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒత్తిడిలో పని చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. కుటుంబ బంధాల కోసం ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొంటారు. వీరి వ్యక్తిత్వం కూడా ఆకట్టుకుంటుంది. వీరు చాలా ఉన్నత వ్యక్తిత్వం కలిగినవారిగా ఉంటారు. దీని కారణంగా ఎదుటి వారిని త్వరగా ఆకట్టుకుంటారు. తులా రాశికి అధిపతి శుక్రుడు, అందుకే ఈ రాశి వారకి శుక్రుడు ఈ లక్షణాలను ప్రసాదిస్తాడు.

కన్య: ఈ రాశి వారు కూడా ప్రేమ వివాహాలను నమ్ముతారు. ఈ వ్యక్తులు తమ భాగస్వామి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారు ఎల్లప్పుడూ తమ భాగస్వామి పట్ల అంకిత భావాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు కూడా వ్యాపార ఆలోచనాపరులు. వీరు తమ భాగస్వామికి విధేయులుగా ఉంటారు. దీని కారణంగా వారు ప్రేమ వివాహంలో విజయం సాధించగలుగుతారు. తమ ప్రియురాలిని సంతోషపెట్టడానికి.. వారి నుంచి ప్రేమను పొందడానికి వారు ఎంతకైనా వెళ్తుంటారు. అదే సమయంలో  వారు సమాజంలో తమ స్వంత గుర్తింపును ఏర్పరుచుకుంటారు. కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం, ఇది వారికి ఈ లక్షణాలను ప్రసాదిస్తుంది.

సింహం: ఈ రాశి వారికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పనైనా ఎంతో శ్రద్ధతో చేస్తారు. వీరు టీమ్ లీడర్‌గా ఉంటారు. వీరు ఎక్కడ ఉన్న తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ రాశివారు ప్రజా నాయకులుగా ఎదుగుతారు. అదే సమయంలో అతను తన భాగస్వామికి పూర్తిగా అంకితభావంతో ఉంటారు. ఈ వ్యక్తులు కొద్దిగా కోపంగా ఉన్నప్పటికీ… కొంత సమయం తర్వాత ఈ వ్యక్తులు శాంతిస్తారు. వీరు తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. దీనితో పాటు చాలా వరకు, ఈ వ్యక్తులు తమ భాగస్వాములతో రాజీలు కూడా చేసుకుంటారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం