Maha Shivratri 2024: శివపూజలో ఇవి నిషిద్ధం.. పొరపాటును కూడా లేకుండా చూసుకోండి!

|

Mar 07, 2024 | 6:45 PM

హిందూ మతంలో శివ రాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. శివరాత్రిని దేశ వ్యాప్తంగా ఎంతో సంబరంగా చేసుకుంటారు. శివరాత్రికి భక్తులందరూ ఉపవాసం ఉండి.. జాగరణ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని.. భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం శివరాత్రి.. ఫాల్గున మాసం కృష్న పక్షంలో వచ్చే చతుర్థశి తిథి రోజు జరుపుతారు. అందులోనూ శివయ్యకు ప్రదోష కాలంలో చేసే పూజకు మరింత ప్రత్యేకం ఉంది. మహా శివరాత్రి రోజు ఉదయాన్నే శివుడికి..

Maha Shivratri 2024: శివపూజలో ఇవి నిషిద్ధం.. పొరపాటును కూడా లేకుండా చూసుకోండి!
Mahashivratri 2024
Follow us on

హిందూ మతంలో శివ రాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. శివరాత్రిని దేశ వ్యాప్తంగా ఎంతో సంబరంగా చేసుకుంటారు. శివరాత్రికి భక్తులందరూ ఉపవాసం ఉండి.. జాగరణ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని.. భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం శివరాత్రి.. ఫాల్గున మాసం కృష్న పక్షంలో వచ్చే చతుర్థశి తిథి రోజు జరుపుతారు. అందులోనూ శివయ్యకు ప్రదోష కాలంలో చేసే పూజకు మరింత ప్రత్యేకం ఉంది. మహా శివరాత్రి రోజు ఉదయాన్నే శివుడికి అభిషేకాలు.. పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. అయితే ఈ శివ పూజలో కొన్ని వస్తువులను అస్సలు ఉపయోగించూడదట. వాటిని ఉపయోగించడం వల్ల శివుడికి పట్టరాని కోపం వస్తుందని అంటారు. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తులసి:

శివ పూజలో తులసి అనేది నిషిద్ధం. తులసి కేవలం విష్ణు పూజలోనే ఉపయోగించాలి. మహా శివరాత్రికి మాత్రమే కాదు.. సాధారణ రోజుల్లో కూడా శివుడి పూజకు తులసిని వినియోగించకూడదు.

పసుపు:

పసుపు అనేది పరమ పవిత్రమైనది. ఇంట్లో ఏ శుభ కార్యం తలపెట్టినా పసుపు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ.. శివ పూజలో మాత్రం పసుపును వినియోగించరు. పసుపు అనేది స్త్రీలకు సంబంధించింది.. అందుకే పరమేశ్వరుడి పూజలో ఉపయోగించరు. పసుపును అసలు శివ లింగానికి పూయరు.

ఇవి కూడా చదవండి

సింధూరం:

సింధూరాన్ని కూడా శివుడి పూజలో ఉపయోగించరు. సింధూరాన్ని తమ భర్త సుదీర్ఘకాలం పాలు బతకాలను స్త్రీలు నుదిటిపై ధరిస్తారు. అయినా సింధూరాన్ని పొరపాటున కూడా శివ పూజలో ఉపయోగించరు.

విరిగిన బియ్యం:

విరిగిన బియ్యాన్ని కూడా పరమేశ్వరుడి పూజలో ఉపయోగించరు. విరిగిన బియ్యంతో అక్షింతలను కూడా వాడరు. విరిగిన బియ్యాన్ని హిందూ మతంలో అశుభంగా భావిస్తారు.

శంఖం:

అదే విధంగా శంఖాన్ని కూడా శివయ్య పూజలు వాడరు. ఈ శంఖంలో శంఖుడు అనే రాక్షసుడు నివసిస్తాడు. అందుకే మహా శివరాత్రి రోజు శంఖంతో నీటిని శివ పూజలో ఉపయోగించరు. ఇలా కొన్ని రకాల వస్తువులను పరమేశ్వరుడి పూజలో వాడరు. వీటికి అనేక కథలు కూడా ప్రాచూర్యంలో ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)