Zodiac Signs: ఈ 5 రాశులవారు చాలా డిప్రెషన్‌కు లోనవుతారు.. మీ ఫ్రెండ్స్ ఈ లిస్టులో ఉన్నారేమో చెక్ చేసుకోండి..

చిన్న చిన్న విషయాలను సైతం భూతద్దంతో చూసి కుమిలిపోయేవారు మరికొందరు. చిన్న సమస్యలకే ఆందోళన పడిపోయి జీవితంపై నిరాశ చెందేవారున్నారు.

Zodiac Signs: ఈ 5 రాశులవారు చాలా డిప్రెషన్‌కు లోనవుతారు.. మీ ఫ్రెండ్స్ ఈ లిస్టులో ఉన్నారేమో చెక్ చేసుకోండి..
Zodiac Signs
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 19, 2022 | 12:15 PM

జోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మనక్షత్రాన్ని, రాశిని బట్టి వారి వ్యక్తిత్వ లక్షణాలు, వారి జీవితంలోని అనేక సంఘటనలపై ప్రభావం చూపిస్తుంటాయి. జీవితం, కెరీర్, ఆనందం, అనారోగ్యం, దంపత్యజీవితం, గెలుపు, ఓటమి ఇలా ప్రతి విషయంలోనూ రాశుల ప్రభావం కాస్త ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారను అనుకోవడానికి లేదు. ప్రతి క్షణాన్ని సంతోషంతో గడిపేందుకు ప్రయత్నించేవారు కొందరు. చిన్న చిన్న విషయాలను సైతం భూతద్దంతో చూసి కుమిలిపోయేవారు మరికొందరు. చిన్న సమస్యలకే ఆందోళన పడిపోయి జీవితంపై నిరాశ చెందేవారున్నారు. కొందరికి ఎంత కష్టపడిన అనుకున్న గమ్యాన్ని చేరడంలో అడ్డంకులు ఎదురుకావడంతో విచారంతో, నిరాశతో, నిస్సహాయతకు డిప్రెషన్‏కు గురయ్యేవారు చాలా మంది ఉంటారు. అయితే అది వారి జన్మరాశి ప్రభావం కూడా ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఐదు రాశుల వారు ఎక్కువగా డిప్రెషన్‏కు గురయ్యేవారున్నారు. ఆ జాబితా ఒకసారి తెలుసుకోండి.

మకరం.. ఈరాశివారు సున్నితమైన మనస్సు ఉన్నవారు. వీరు భావోద్వేగాలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. ఒకవేళ వారి ఎమోషన్స్ బయటపెట్టకపోతే వారు తీవ్ర నిరాశకు గురవుతారు. వీరు ప్రతి విషయంలోనూ బాధ్యత తీసుకుంటారు. ఎప్పుడూ ప్రతిదానికీ తమను తాము నిందించుకుంటారు. ఈ అపరాధ భావంతోనే వారు డిప్రెషన్‏కు గురవుతారు. బాధ, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో వారు ప్రశాంతతకు దూరమవుతారు. వీరు ఎప్పుడు వారి భావోద్వేగాలను ఎదుటివారిపై చూపించరు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వీరు తమను తాము నమ్మడం, ఓపెన్ మైండెడ్ వైఖరిని అవలంభించుకోవడం వలన జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవచ్చు.

వృషభ రాశి.. ఎక్కువగా అంతర్ముఖులు, వృషభ రాశి వ్యక్తులు తమ కంఫర్ట్ జోన్‌లో ఉండటానికి ఇష్టపడతారు. వారు ఎల్లప్పుడూ వారి రోజూవారీ దినచర్యను అనుసరిస్తారు. వారి రోజువారీ జీవితంలో ఏవైనా మార్పులు వస్తే అస్సలు సహించరు. వీరు డిప్రెషన్‌కు గురికావడానికి ప్రధాన కారణం వారి రోజువారీ దినచర్యలలో ఎదురయ్యే మార్పులు, వారి సౌకర్యాలకు దూరంగా ఉండటం కూడా వారిలో ఆందోళనను పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి.. వీరు ఏ విషయాన్నైనా లోతుగా..తీవ్రంగా ఆలోచించడం వలన డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. వారు తమ వ్యక్తిగత సంబంధాలలో ఎక్కువగా ఆశలు పెంచుకుంటారు. ఒకవేళ వారి అంచనాలకు తగినట్టుగా పని జరగకపోతే లేదా గతంలో వారికి హాని కలిగించే విషయాలు ఎదురైతే ఎక్కువగా బాధపడతారు. ఒంటరితనం, ప్రియమైనవారి నుండి విడిపోవడం వారిని నిరాశకు గురి చేస్తుంది. వారు తరచుగా తమ భావాలను పంచుకోరు, ఎందుకంటే ఎవరైనా తమను చులకన చేస్తారని భావిస్తారు. వారి భావోద్వేగాలను పంచుకోవాలని, భావోద్వేగ సంబంధాలను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

కర్కాటక రాశి.. వారు బయట ధైర్యం ఉన్నవారిగా కనిపిస్తారు. కానీ లోపల సున్నితంగా ఉన్న వ్యక్తులు. అత్యంత శ్రద్ధగలవారు. దీని కారణంగా వారు సులభంగా బాధపడతారు. వారు చేసే ప్రతి పనిలో 100% ఇచ్చిన తర్వాత కూడా, వారు ఇతరుల నుండి నిరాశను పొందుతారు. వారు సాధారణంగా తమ భావోద్వేగాలను దాచుకోవడంలో ఓడిపోతారు.

మీన రాశి.. సాధారణంగా వీరు దయ, ప్రేమగల వ్యక్తులు, బలిదానం, స్వీయ త్యాగం వైపు మొగ్గు చూపుతారు. ఈ తనకు తాను హాని కలిగించారు. జీవితంపై కలలు కనే దృక్పథం వారిని నిరుత్సాహపరుస్తుంది. ఎప్పుడూ దిగులుగా ఉండేలా చేస్తుంది. వారు సాధారణంగా తమ జీవితాలను తమకు కావలసినంత నియంత్రించాలని కోరుకుంటారు. ఒకవేళ ఆ విషయం జరగకపోతే వారు ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా బాధపడాలనుకుంటారు. వారి కుటుంబం , స్నేహితులను సంతోషంగా ఉంచడానికి బయట నవ్వడానికి ప్రయత్నిస్తారు. రియాలిటీతో సన్నిహితంగా ఉండటం, స్వీయ త్యాగాన్ని నివారించడం, వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ మెప్పించడానికి ప్రయత్నించడం మానేయడం మంచిది.