తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాల సందర్శన కోసం వెళ్లే భక్తులకు టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం వెళ్లాలనుకునే వారి కోసం టూరిజం టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. టూరిజం ఏసీ బస్సు ద్వారా శ్రీశైలం టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇది రెండు రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి నేరుగా సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైల సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం.. మల్లికార్జున స్వామి దర్శనం ఉంటుంది. రెండో రోజు పాతాళ గంగ, పాలధార, పంచధార, శిఖరం, ఆనకట్టలను రోప్‌వే ద్వారా సందర్శిస్తారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.2400, పిల్లలకు రూ.1920.
కాళేశ్వరం వన్ డే టూర్ ప్యాకేజీని అందిస్తుంది. ఉదయం 5 గంటలకు బయలుదేరి 8 గంటలకు వరంగల్‌లోని హోటల్‌కు చేరుకుంటుంది. అల్పాహారం తర్వాత రామప్పలోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ, కానేపల్లి పంప్ హౌస్‌లను సందర్శించవచ్చు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ టూర్ ప్యాకేజీ శనివారం, ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.రూ.1850. పిల్లలకు రూ.1490.
వేములవాడకు వన్ డే టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరతారు. కొమురవల్లి మల్లికార్జున స్వామి ఆలయ సందర్శన అనంతరం.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని కొండగట్టుకు వెళ్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన తర్వాత తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ టూర్ ప్యాకేజీ శనివారం, ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.1200. పిల్లలకు రూ.960.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.