Talasani : అన్ని పండుగలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష : మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం తన ఆధ్వర్యంలో నిర్వహిస్తుందని ఆయన గుర్తుచేశారు...

Talasani : అన్ని పండుగలను  ప్రజలు ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష : మంత్రి తలసాని
Talasani
Follow us

|

Updated on: Jul 07, 2021 | 10:08 PM

Bonalu Festival : అన్ని పండుగలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం తన ఆధ్వర్యంలో నిర్వహిస్తుందని ఆయన గుర్తుచేశారు. ఈ నెల 25 న నిర్వహించనున్న మహంకాళి బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మహంకాళి ఆలయం ఆవరణలో వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సమీక్ష నిర్వహించారు.

ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. కరోనా భారిన పడకుండా నిబంధనలు పాటిస్తూ భక్తులు బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించారు. మాస్క్ లు, శానిటైజర్ లను తప్పని సరిగా ఉపయోగిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తోనే సాధ్యమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు.

Read also: Jithender Reddy: తప్పుడు ఆరోపణలతో ఈటల రాజేందర్‌ను బయటికి పంపించారు : జితేందర్ రెడ్డి