Kashi Viswanath Corridor: రేపు మోడీ కలల ప్రాజెక్ట్ ప్రారంభం..వారణాసిలో 16లక్షల లడ్డుల పంపిణీకి ఏర్పాట్లు..

Shri Kashi Prasadam: వారణాసి సరికొత్త అందాలతో కనువిందు చేస్తుంది. కాశీ విశ్వనాథ దేవాలయం కొత్త రంగులో దర్శనమిస్తుంది. రేపు (డిసెంబర్ 13వ తేదీన ) ప్రధాని మోడీ..

Kashi Viswanath Corridor: రేపు మోడీ కలల ప్రాజెక్ట్ ప్రారంభం..వారణాసిలో 16లక్షల లడ్డుల పంపిణీకి ఏర్పాట్లు..
Kashi Prasadam
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2021 | 3:48 PM

Kashi Viswanath Corridor: వారణాసి సరికొత్త అందాలతో కనువిందు చేస్తుంది. కాశీ విశ్వనాథ దేవాలయం కొత్త రంగులో దర్శనమిస్తుంది. రేపు (డిసెంబర్ 13వ తేదీన ) ప్రధాని మోడీ కలల ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. రూ.  600 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.  దీంతో రేపు చేపట్టనున్న వారణాసి పర్యటన ప్రధాని నరేంద్ర మోడీకి చాలా ప్రత్యేకం కానుంది. కోవిడ్  కరోనా నిబంధనలు అనుసరిస్తూ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రేపు  నగరమంతటా స్వీట్లు పంచనున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత 7 లక్షల ఇళ్లలో వందల గ్రూపుల ద్వారా పంపిణీ చేయనున్నారు. స్వీట్స్ పంపిణి కోసం దాదాపు 16 లక్షల లడ్డూలను రెడీ చేస్తున్నారు. దీంతో పాటు ఓ పుస్తకాన్ని కూడా బహుమతిగా అందజేయనున్నారు. మిఠాయిల పంపిణీ బాధ్యతను ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ శాఖకు అప్పగించారు.

కాశీ-విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవానికి వందలాది మంది సాధువులు, మహంతులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కాశీ నగరం, చుట్టుపక్కల ప్రజలకు లడ్డు ప్రసాదం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. , కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత దాదాపు 16 లక్షల లడ్డూలపంపిణీ చేయనున్నామని అధికారులు తెలిపారు. సుమారు 7 లక్షల ఇళ్లకు వందల గ్రూపులు ఈ స్వీట్స్ ను పంచనున్నారు.

ప్రసాదం పంపిణీ కోసం తయారు చేస్తున్న లడ్డూలను ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్నామని.. లడ్డులు తయారు చేసే చోట పరిశుభ్రత, స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ వందలాది మంది లడ్డూల తయారీ, ప్యాకింగ్ తదితర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే దేశీ నెయ్యితో లడ్డులను తయారు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారణాసిలో తొలిసారిగా నగరం అంతటా ఇంత పెద్ద ఎత్తున ప్రసాదాన్ని ఇంటింటికీ పంపనున్నట్లు చెప్పారు. ఈ 16 లక్షల లడ్డూలను దాదాపు 15 వేల గ్రూపుల ద్వారా పంపిణీ చేయనున్నారు. వారణాసిలో సుమారు 8 లక్షల వరకూ ఇళ్ళు ఉన్నాయని.. ఇంటింటికి లడ్డులు ప్రసాదం పంపిణీకి వాలంటీర్ల సహకారం కూడా తీసుకుంటామని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ తెలిపింది.

 Also Read:  లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. శుక్రవారం రోజున ఈ 4 పరిహారాలు చేసి చూడండి..(photo gallery)