Swapna Shastra: కలలో వెలుగుతున్న దీపం కనిపిస్తే ఎటువంటి సంకేతాలని తెలియజేస్తుందంటే..

ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కంటారు. ఇది ఒక సాధారణ ప్రక్రియ. ఈ కలలో కనిపించే సంకేతాలను తెలియజేసే శాస్త్రం.. స్వప్న శాస్త్రం. కలలో కనిపించే విషయాలు మన భవిష్యత్తు గురించి మంచి లేదా చెడు సంకేతాలను ఇస్తుందని పేర్కొంది. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు అదృష్టం లేదా దురదృష్టానికి సంకేతంగా ఉండవచ్చు. అలా కలలో దీపం కనిపిస్తే అది శుభప్రదమా..! ఎటువంటి సంకేతాలు ఈ కల ద్వారా తెలియజేస్తాయో తెలుసుకుందాం..

Swapna Shastra: కలలో వెలుగుతున్న దీపం కనిపిస్తే ఎటువంటి సంకేతాలని తెలియజేస్తుందంటే..
Swapna Shastra

Updated on: Jul 17, 2025 | 12:50 PM

జ్యోతిష్య శాస్త్రం, సాముద్రిక శాస్త్రం వలెనే స్వప్న శాస్త్రం కూడా మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైన పుస్తకం. ఈ స్వప్న శాస్త్రంలో కలలో కనిపించే సంకేతాలను తెలియజేస్తుంది. దీనిలో కలలకు సంబంధించిన మర్మమైన సంకేతాలను వివరించారు. భవిష్యత్తులో జరిగే సంఘటనలను, మన భావోద్వేగాలను, ఆధ్యాత్మిక సందేశాలను సూచిస్తుందని నమ్ముతారు. స్వప్న శాస్త్రం ప్రకారం, కొన్ని కలలు అదృష్టం లేదా దురదృష్టానికి సంకేతంగా ఉండవచ్చు. ఎవరి కలలోనైనా వెలుగుతున్న దీపం కనిపిస్తే అది సాధారణ కల కాదు. అది దైవిక సంకేతం. స్వప్న శాస్త్రం ప్రకారం వెలుగుతున్న దీపం ఇచ్చే సంకేతాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

కోరికలు నెరవేరడానికి శుభ సంకేతం
కలలో వెలుగుతున్న దీపాన్ని చూడటం అనేది మీ దీర్ఘకాల కోరిక నెరవేరబోతోందని సూచిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసం, భక్తి శక్తి ద్వారా పొందిన ఆశీర్వాదాలకు చిహ్నం.

ఇంట్లో ఆనందం, శాంతి రాక
దీపం వెలుగుకు చిహ్నం. ఎవరి కలలోనైనా ఒక ఆలయం, ఇల్లు లేదా పవిత్ర స్థలంలో వెలుగుతున్న దీపం కనిపిస్తే.. ఆ ఇంట్లో సానుకూల శక్తి, లక్ష్మీ దేవి నివసిస్తుందని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీవితంలో వెలుగు
కలలో వెలుగుతున్న దీపాన్ని చూడటం అంటే మీ గత జీవితంలో లేదా ప్రస్తుత జీవితంలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి పోతాయని.. ఇక నుంచి జీవితంలో ఆధ్యాత్మిక పురోగతికి మార్గం తెరుచుకుంటుందని సూచిస్తుంది.

ఆధ్యాత్మిక మేల్కొలుపుకు సంకేతం.
దీపం వెలుగు ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రకమైన కల మీ మనస్సు ఇక నుంచి భగవంతుని మార్గం వైపు కదిలేలా.. ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా భక్తి వైపు కదులుతున్నట్లు చూపిస్తుంది.

దేవుని దయ, పూర్వీకుల శాంతి
ఎవరి కలలోనైనా నదిలో కదులుతున్న దీపం లేదా వెలుగుతున్న దీపం నీటిలో తేలుతున్నట్లు కనిపించినట్లు అయితే ఈ కలకు అర్ధం పూర్వీకుల ఆత్మలు సంతోషంగా ఉన్నాయని, దేవతల ఆశీస్సులు మీకు రానున్నాయని సూచిస్తుంది.

కనుక స్వప్న శాస్త్రం ప్రకారం కలలో దీపం చూడటం చాలా శుభప్రదమైన, ఆధ్యాత్మిక సంకేతం. ఈ కల జీవితంలో కొత్త వెలుగు , శక్తి రాక గురించి ముందుగానే సందేశాన్ని ఇస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.