హిందువుల పవిత్ర పురాణం గ్రధం రామాయణం. ఈ పురాణం గ్రంధం చదివినా , విన్నా మానవుల నడవడిక గురించి తెలుస్తుందని నమ్మకం. ఈ రామాయణంలో శ్రీ రాముడు తనకు ఇష్టం లేకుండా తన ప్రియమైన తమ్ముడు లక్ష్మణుడికి మరణ శిక్ష విధించవలసి వచ్చిన సంఘటన రామాయణంలో వర్ణించబడింది. పురాణాల కథ ప్రకారం శ్రీరాముడు రాజ్యాన్ని పాలిస్తూ రాజుగా తన విధులను నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అయోధ్యను రక్షించడానికి లక్ష్మణుడికి మరణశిక్ష విధించవలసి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అయోధ్యను ప్రమాదంలో పడిన సమయంలో లక్ష్మణుడు ప్రాణాలను బలి ఇవ్వవలసి వచ్చింది.. ఈ రోజు ప్రాణసమనుడైన లక్ష్మణుడిని శిక్షించి అయోధ్యపురిని రక్షించాడు.
రావణుడిని సంహరించిన శ్రీరాముడు లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు.. అతనికి అయోధ్య ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపి అయోధ్యకు రాజుగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత శ్రీరాముడు అయోధ్య రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని రాజ్యపాలన ప్రారంభించాడు.
ఒకరోజు యముడు శ్రీ రాముడిని కలవడానికి అయోధ్యకు వచ్చాడు. చర్చను ప్రారంభించే ముందు తనకు రాముడికి మధ్య సంభాషణ జరిగినప్పుడు.. ఇద్దరి సంభాషణ జరుగుతున్న సమయంలో మధ్య ఎవరూ రాకూడదు. అనే కండిషన్ పెట్టాడు. యముడు. మధ్యలో అచ్చి ఎవరు ఆటంకం కలిగించినా మరణశిక్ష విధిస్తానని వాగ్దానం చేయమని రాముడిని యముడు కోరాడు. దీని తరువాత, శ్రీరాముడు లక్ష్మణుడు.. రాముడు, యముడు మాట్లాడుతున్న రూమ్ కు కావలా ఉన్నాడు.. యముడుతో తన సంభాషణ ముగిసే వరకు ఎవరినీ అక్కడికి అనుమతించవద్దని చెప్పాడు రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడుకి వెల్లడించాడు.
లక్ష్మణుడు తన అన్న రామయ్య ఆజ్ఞను అనుసరించి ద్వారపాలకుడిగా గది బయట నిలబడ్డాడు. అదే సమయంలో దూర్వాస మహర్షి రాముడి దర్శనం కోసం వచ్చాడు. అక్కడ గదికి ద్వారపాలకుడుగా నిలిచిన ఉన్న లక్ష్మణుడిని చూసి.. అక్కడకు వెళ్లి దుర్వాస మహర్షి వెళ్లి తన రాకను శ్రీరామునికి తెలియజేయమని చెప్పాడు. అయితే దుర్వాస మహర్షి కోరికను లక్ష్మణుడు సున్నితంగా తిరస్కరించాడు.
లక్ష్మణుడు అతని అభ్యర్థనను తిరస్కరించడంతో దుర్వాస మహర్షి కోపం వచ్చింది. తన కోరినకు పట్టించుకోని లక్ష్మణుడు వైపు చూస్తూ అయోధ్య మొత్తాన్ని శపిస్తానని చెప్పాడు. దుర్వాస ముని కోపాన్ని చూసిన లక్ష్మణుడు అయోధ్యలోని ప్రజలను శాపం నుంచి రక్షించడానికి ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆజ్ఞను ధిక్కరించి లోపలికి వెళ్లి దుర్వాస మహర్షి రాక గురించి శ్రీరామునికి తెలియజేశాడు.
తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న శ్రీరాముడు లక్ష్మణునికి మరణశిక్ష విధించవలసి వచ్చింది. అప్పుడు రాముడు మదిలో సందిగ్ధం స్థితి నెలకొంది. తన గురువైన వశిష్ఠుడిని ధ్యానిస్తూ, మార్గాన్ని సూచించమని అడిగాడు.అప్పుడు గురుదేవులైన వశిష్ట మహర్షి తనకు ఇష్టమైన దానిని త్యాగం చేయడం మరణానికి సమానమని చెప్పాడు. నువ్వు కూడా లక్ష్మణుడిని త్యాగం చేయాలని చెప్పాడు. తమ గురువు చెప్పిన విషయం విన్న లక్ష్మణుడు.. తన అన్న రామయ్యతో మాట్లాడుతూ.. నువ్వు పొరపాటున కూడా నన్ను విడిచిపెట్టకు.. నీకు దూరంగా ఉండడం కంటే నీ వాగ్దానాన్ని పాటించి మృత్యువును ఆలింగనం చేసుకోవడం మేలు అని రాముడితో అన్నాడు. అనంతరం లక్ష్మణుడు సరయు నదిలో కలిసి జలసమాధి అయ్యాడు. అలా శ్రీ మహావిష్ణువు శేష తల్పం అయిన శేషుడు లక్ష్మణుడుగా తన అవతారాన్ని చాలించాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు