AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక గమనిక.. అలా చేయవద్దని వినతి

కన్నులపండువగా జరిగే శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల కోసం తిరుమల సప్తగిరులు అధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కొవిడ్‌ ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు రానుండటంతో దానికి తగ్గ ఏర్పాట్లు TTD చేసింది.

Tirumala: బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక గమనిక.. అలా చేయవద్దని వినతి
Ttd Brahmotsavam 2022
Ram Naramaneni
|

Updated on: Sep 26, 2022 | 4:57 PM

Share

Tirupati: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల ముస్తాబైంది. కోరికలు తీర్చే ఆ కోనేటిరాయుడి క్షణకాలం దర్శనం కోసం బ్రహ్మోత్సవాల వేళ భక్తులు భారీగా వెంకటాద్రికి తరలివస్తున్నారు. తిరుమాడ వీధుల్లో వాహనాలపై విహరించే ఆ వేంకటేశ్వరుడి చూసి తరించాలన్నది లక్షల మంది భక్తులు కోరిక. గడిచిన రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా బ్రహ్మోత్సవాల వేళ భక్తుల రాకపోకలపై TTD ఆంక్షలు విధించింది. ఈసారి వాటిని తొలగించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వాహన సేవ సందర్భంగా స్వామివారి నుంచి భక్తులు పులకించి పోతుంటారు. చాలా మంది తన్మయత్వంతో స్వామి వారి విగ్రహం పైకి నాణేలు విసురుతుండటం పరిపాటి. భక్తులు విసిరే నాణెలా కారణంగా ఉత్సవ మూర్తులు, స్వామి వారి ఆభరణాలకు నష్టం కలుగుతోంది. అంతే కాదు వాహనంతో పాటు పూజారులు, వాహనాన్ని మోసే సిబ్బంది కూడా గాయాలబారిన పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి పనులు చేయవద్దని ఈసారి భక్తులకు TTD విజ్ఞప్తి చేసింది.

-మెటల్‌ డిటెక్టర్‌ ఫ్రేమ్స్‌ ద్వారా భక్తుల తనిఖీ -2200 సీసీ కెమెరాలతో పటిష్ఠమైన నిఘా వ్యవస్థ -గరుడసేవ రోజు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

శ్రీవారి వాహన సేవలు వీక్షించేందుకు గ్యాలరీల్లోకి వచ్చే భక్తులను తనిఖీ చేసేందుకు మెటల్‌ డిటెక్టర్‌ ఫ్రేమ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. 2200 CC కెమెరాలతో తిరుమలలో వ్యవస్థ నెలకొల్పారు. గరుడ సేవ రోజు శ్రీవారి దర్శనానికి నాలుగు లక్షల మంది వరకు భక్తులు రావచ్చని టీటీడీ భావిస్తోంది. ఆ రోజు అదనంగా మరో 1500 మంది పోలీసులను మొహరించనున్నారు.  వాహన సేవలు తిలకించేందుకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అంతే కాదు తిరుమలలో ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం విధించిన కారణంగా భక్తులు సొంతంగా స్టీల్‌, రాగి వాటర్‌ బాటిళ్లు తెచ్చుకోవాలని సూచించింది. వాహనాల పార్కింగ్‌ విషయంలోనూ TTD ఈసారి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. తిరుమలలో 12 వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉంది. అదనంగా వచ్చే వాహనాలను అలిపిరి దగ్గరే పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..