Nettikanti Anjaneya: కుడికంటితో భక్తులను చూస్తూ కోరినకోర్కెలు నెరవేర్చే నేట్టికంటి ఆంజనేయస్వామి

|

Aug 14, 2021 | 11:24 AM

Sri Nettikanti Anjaneya: మనసుకు సంతోషానికి సంతోషం, ఆహ్లాదాన్ని ఆహ్లాదం ఇచ్చేవి విహారయాత్రలు. అందుకనే మన పెద్దలు పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ఆనవాయితీ పెట్టారు. అలా తప్పకుండా ప్రతి ఒక్కరూ..

Nettikanti Anjaneya: కుడికంటితో భక్తులను చూస్తూ కోరినకోర్కెలు నెరవేర్చే నేట్టికంటి ఆంజనేయస్వామి
Nettikanti Anjaneya Swami
Follow us on

Sri Nettikanti Anjaneya: మనసుకు సంతోషానికి సంతోషం, ఆహ్లాదాన్ని ఆహ్లాదం ఇచ్చేవి విహారయాత్రలు. అందుకనే మన పెద్దలు పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ఆనవాయితీ పెట్టారు. అలా తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించుకునే క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. అలా ఒకే రోజు వ్యాసరాయల వారు ప్రతిష్ట చేసిన మూడు ఆంజనేయుని క్షేత్రాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి శ్రీ నేట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం.

గుంతకల్ జంక్షన్ దగ్గర లో ఉన్న క్షేత్రం కాసపురం. ఇక్కడ క్రీ .శ . 1521 సంవత్సరం లో శ్రీ వ్యాసరయలవారు హంపి క్షేత్రం లో తుంగభద్రా నది తీరం లో కర్మనుష్టానం చేస్తూ తాను ధరించే గంధంతో తన ఎదురుగా ఉన్న శీలా పైన ఆంజనేయ స్వామి రూపం చిత్రించాడు. అది నిజ రూపం ధరించి వెళ్తూ ఉంది. ఈ విధంగా అయదు సార్లు చిత్రించగా అదే విధంగా జరిగింది. చివరికి వ్యాసరాయలవారు అంజనేయ స్వామి వారి ద్వాదశ నామ బీజాక్షరం తో యంత్రం రాసి దానిలో స్వామి వారి నిజరూపం చిత్రించగా స్వామి వారు ఆ యంత్రంలో బంధించబడ్డారు. అప్పుడు స్వామి వారు వ్యాస రాయల వారు స్వప్నం లో స్వామి కనిపించి నేను ఈ క్షేత్రం లో ఉన్నాను దాన్ని తీసి ప్రతిస్టించమని చెప్పగా .. వ్యాసరయలవారు ఈ ప్రాంతాన 732 ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్టించాడట.

చిప్పగిరి గ్రామం లోని శ్రీ భోగేశ్వర స్వామి గుడి లో వ్యాసరయలవారు నిద్రిస్తుండగా నేను ఇక్కడ నుండి దక్షిణ దిక్కుగా కొద్దిరుపం లో భూమి లో ఉన్నాను నన్ను తిరిగి ప్రతిస్టించమని చెప్పారు. వ్యాసుల వారు దారి చూపించమని అడగగా ఆంజనేయుడు ప్రస్తుతం నా పైన ఎండిన వేప చెట్టు ఉంది అది నువ్వు రాగానే పచ్చగా చిగురిస్తుంది అని మార్గం సూచించారు. వ్యాసరాయల వారు కసపురానికి విచ్చేసి శ్రీ స్వామి వారి మిద ఉండే వేప వృక్షానికి సమీపించగానే అది పచ్చగా చిగురించింది. అప్పుడు వ్యాసుల వారు ఆ ప్రాంతాన్ని తవ్వించి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది. కసాపురం గ్రామానికి దగ్గరగా ఉండటం వలన కసాపురం ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు. నెట్టి కల్లు (మంచి రాయి)లో ఆర్బవించినందున శ్రీ స్వామి వారికి నేట్టికంటి ఆంజనేయ స్వామి అనే పేరు ప్రసిద్దమైనది. నేట్టికంటి అనగా ఒక కన్ను కలవాడని అర్థం. విగ్రహంలో స్వామి కుడి కంటి తో భక్తులను చూస్తూ వారి మనోభిష్టాలను నెరవేరుస్తున్నారు. స్వామి వారు కోరిన కోరికలు, వారి భాదలను తీర్చే కొంగు బంగారంగా పూజలను అందుకుంటున్నాడు.

Also Read: Hairy Ears: పురుషుల చెవిపై వచ్చే వెంట్రుకలు వల్ల ఏదైనా ప్రమాదాలు ఏర్పడతాయా..

Chanakya Niti: విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో సక్సెస్ అందుకోవాలంటే ఈ 4 సూత్రాలు పాటించమంటున్న చాణక్య