Sri Neelakanteswara Swamy: వైభవంగా నీలకంటేశ్వర స్వామి జాతర.. నేడు రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు

| Edited By: Surya Kala

Jan 27, 2024 | 11:10 AM

శ్రీ నిలకంటేశ్వర స్వామి జాతర వేడుకల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం వ్యాహావళి, ప్రభావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఉత్సవమూర్తులు పార్వతి, పరమేశ్వరుల ఉత్సవమూర్తులను పుష్పక రథంపై అధిష్టింపజేసి వ్యాహావళోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం నీలకంఠేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం నుంచి తేరుబజారు వరకు సాగింది.

Sri Neelakanteswara Swamy: వైభవంగా నీలకంటేశ్వర స్వామి జాతర.. నేడు రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
Sri Neelakanteswara Swamy
Follow us on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలను చూసేందుకు భక్తులకు రెండు కళ్ళు చాలడం లేదు. దేవతామూర్తులను కనులారా చూసి పరవశించేందుకు వస్తున్న భక్తజనంతో పురవీధులు కిటకిటలాడుతున్నాయి.  గురువారం అర్థరాత్రి కల్యాణం జరుపుకున్న ఉత్సవమూర్తులు పార్వతి, పరమేశ్వరులను శనివారం రాత్రి 10.30 గంటలకు దేవాలయం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఉత్సవమూర్తులను పుష్పక రథంపై అధిష్టింపజేసి వ్యాహావళోత్సవం నిర్వహించారు.

శ్రీ నిలకంటేశ్వర స్వామి జాతర వేడుకల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం వ్యాహావళి, ప్రభావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులు పార్వతి, పరమేశ్వరుల ఉత్సవమూర్తులను పుష్పక రథంపై అధిష్టింపజేసి వ్యాహావళోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం నీలకంఠేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం నుంచి తేరుబజారు వరకు సాగింది. తేరుబజారులో పుష్పక రథంపై ఉన్న ఉత్సవమూర్తులను ప్రభపై అధిష్టింపజేసి ప్రభావళి మహోత్సవం చేపట్టారు. తేరు బజారు నుంచి ఎదురు బసవన్న గుడి మీదుగా తిరిగి యథాస్థానం వరకు వ్యాహావళి మహోత్సవం నిర్వహించారు. భక్తులు నందికోల సేవతో, భజన లతో అలరించారు. ఉత్సవాల్లో ధర్మకర్త మురళీధర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎమ్మిగనూరు ప్రజల ఆరాధ్యదైవం నీలకంఠేశ్వరస్వామి మహారధోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ మేరకు రధోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, ఆలయ నిర్వాహకులు పూర్తి చేశారు. ఏర్పాట్లను ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఎద్దులింటి మాచాని నీల మురళీధర్, మాచాని శివకుమార్, మున్సిపల్ కమిష నర్ గంగిరెడ్డి పరిశీలించారు. రధోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలు మూలల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..