janmashtami 2024: కృష్ణ జన్మాష్టమి పూజలో ఈ ఐదు వస్తువులు చేర్చండి.. జీవితంలో దుఖం నుంచి ఉపశమనం కలుగుతుంది..

|

Aug 25, 2024 | 9:37 AM

ఈసారి జన్మాష్టమి రోజున అరుదైన యాదృచ్ఛికం చోటుచేసుకోనుంది. జన్మాష్టమి రోజున అర్ధరాత్రి సర్వార్థ సిద్ధి యోగంతో పాటు అష్టమి తిథి, రోహిణి నక్షత్రాలు కూడా ఉంటాయి. శ్రీ కృష్ణుడు రోహిణి నక్షత్రంలో అష్టమి తిథి నాడు జన్మించాడు. ఈసారి కూడా ఉదయ తిథిలో శ్రీ కృష్ణుడి పుట్టిన తేది, రాశి కలిసి రావడం లేదు. అర్ధరాత్రి అష్టమి తిథి, రోహిణి నక్షత్రాల సంగమం కారణంగా, పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఆగస్టు 26వ తేదీ సోమవారం జయంతి యోగంలో జరుపుకుంటారు.

janmashtami 2024: కృష్ణ జన్మాష్టమి పూజలో ఈ ఐదు వస్తువులు చేర్చండి.. జీవితంలో దుఖం నుంచి ఉపశమనం కలుగుతుంది..
Krishna Janmashtami
Follow us on

హిందూ మతంలో ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగను శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా శ్రావణ మాసంలోని అష్టమి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువు దశావతారాల్లోని ఎనిమిదవ అవతారంగా శ్రీ కృష్ణుడు జన్మించాడు. చెడుపై మంచి విజయం కోసం శ్రీ కృష్ణుడు అవతారం దాల్చాడు. తన జీవితకాలంలో చాలా మంది రాక్షసులను చంపి ధర్మాన్ని స్థాపించాడు. ఈ పండుగ శ్రీకృష్ణుని భక్తికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.

ఈసారి జన్మాష్టమి రోజున అరుదైన యాదృచ్ఛికం చోటుచేసుకోనుంది. జన్మాష్టమి రోజున అర్ధరాత్రి సర్వార్థ సిద్ధి యోగంతో పాటు అష్టమి తిథి, రోహిణి నక్షత్రాలు కూడా ఉంటాయి. శ్రీ కృష్ణుడు రోహిణి నక్షత్రంలో అష్టమి తిథి నాడు జన్మించాడు. ఈసారి కూడా ఉదయ తిథిలో శ్రీ కృష్ణుడి పుట్టిన తేది, రాశి కలిసి రావడం లేదు. అర్ధరాత్రి అష్టమి తిథి, రోహిణి నక్షత్రాల సంగమం కారణంగా, పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఆగస్టు 26వ తేదీ సోమవారం జయంతి యోగంలో జరుపుకుంటారు.

జన్మాష్టమి పూజలో ఈ 5 విషయాలు తప్పనిసరిగా ఉండాలి

  1. శ్రీ కృష్ణుని విగ్రహం లేదా చిత్రం: పూజలో ప్రధాన భాగం శ్రీ కృష్ణుని విగ్రహం లేదా చిత్రం. మీరు మీ ఎంపిక ప్రకారం చిన్న లేదా పెద్ద విగ్రహం లేదా చిత్రాన్ని ఎంచుకోవచ్చు.
  2. పూలు- దండలు: శ్రీకృష్ణుడు తాజా పూల దండలతో అలంకరించండి. తులసి దళాలు, మల్లె లేదా ఇతర సువాసనగల పువ్వులను ఉపయోగించవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. ధూపం- దీపం: ధూపం, దీపం వెలిగించడం ద్వారా పర్యావరణం శుద్ధి అవుతుంది. నెయ్యి దీపం లేదా అగరుబత్తీలు వెలిగించవచ్చు.
  5. పండ్లు – స్వీట్లు: వివిధ రకాల పండ్లు, స్వీట్లను శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. వెన్న, చక్కెర మిఠాయి, పాలకోవ, లడ్డూ మొదలైనవి శ్రీకృష్ణునికి ప్రీతికరమైనవి.
  6. పంచామృతం: పంచామృతం అనేది పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరుతో చేసిన పవిత్ర మిశ్రమం. దీనిని శ్రీకృష్ణునికి సమర్పిస్తారు.

కృష్ణ జన్మాష్టమిని ఇలా జరుపుకోండి

కృష్ణ జన్మాష్టమి రోజున దేవాలయాలు, గృహాలలో శ్రీకృష్ణుని పూజించండి. ఈ రోజున ఉపవాసం ఉండి అర్ధరాత్రి శ్రీకృష్ణునికి ఆహారం సమర్పించండి. దేవాలయాలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భజనలు, కీర్తనలు, నాటకాలు ఉంటాయి. శ్రీకృష్ణుని విగ్రహాలను పూలమాలలతో అలంకరించండి. కృష్ణ భగవానుడికి వెన్న, పంచదార మిఠాయి, పండ్లు వంటి కన్నయ్యకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు