దీపావళి పండుగ అంటే పెద్దలకు అయినా, చిన్న పిల్లలకు అయినా ఎంతో ఇష్టం. చిన్న పిల్లలు అయితే ముఖ్యంగా ఈ పండుగ కోసం ఏడాది అంతా వెయిట్ చేస్తూంటారు. వారికి ఇష్టమైన పండుగల్లో ఇది కూడా ఒకటి కాబట్టి. అయితే దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడం, ఇంటిని అందంగా దీపాలతో అలంకరించుకోవడం, టపాసులు కాల్చడం వంటివి చేస్తూంటారు. అయితే ఇంకొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కూడా కలసి వస్తుందట. కొన్ని రకాల మొక్కలను దీపావళి పండుగ రోజు ఇంటికి తీసుకొస్తే.. చాలా మంచిదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి మొక్క:
తులసి మొక్కను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందువుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను కూడా లక్ష్మీ దేవి రూపంగా భావించి పూజలు చేస్తూంటారు. దీపావళి పండుగ రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకు రావడం వల్ల లక్ష్మీ దేవి ఆశీర్వాదం కలుగుతుంది. దీపావళి రోజున తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు.
బటర్ ఫ్లై పీ ప్లాంట్:
సీతా కోక చిలుక మొక్క లేదా అపరాజిత మొక్క. ప్రస్తుతం ఇవి కూడా అందరి ఇళ్లల్లో కనిపిస్తున్నాయి. అపరాజిత పువ్వులను.. లక్ష్మీ దేవికి ఇష్టమైన పువ్వుగా పరిగణిస్తారు. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఆనందం, విజయానికి మార్గం సుగమం చేస్తాయట. అలాగే ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగు పరుస్తుందట. కాబట్టి దీపావళి రోజు ఈ మొక్కను తీసుకొస్తే మంచిది.
రాత్రి జాస్మిన్ ప్లాంట్:
రాత్రి జాస్మిన్ మొక్క ఆనందానికి మంచిదని అందరూ భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ అపరాజిత మొక్కను విష్ణువుగా భావిస్తారు. అలాగే దీన్ని లక్ష్మీ దేవతలకు ఇష్టమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్క పువ్వులను దేవుడికి సమర్పించడం వల్ల ఆశీర్వాదాలు పొందవచ్చు.
ఇలా ఇంటికి ఈ రకమైన మొక్కలు తీసుకు రావడం వల్ల ఇంట్లో శ్రేయస్సు, ఆర్థిక సమస్యలు తొలగి ఆనందంగా ఉండేందుకు సహాయ పడుతుంది.