Spiritual Rules: రోజూ ఇంట్లో దీపం వెలిగిస్తున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
Spiritual Rules: హిందూమతంలో అగ్ని చాలా పవిత్రమైనది, గౌరవనీయమైనదిగా పరిగణించబడుతుంది. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు.
Spiritual Rules: హిందూమతంలో అగ్ని చాలా పవిత్రమైనది, గౌరవనీయమైనదిగా పరిగణించబడుతుంది. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అలాగే పూజ సమయంలో ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తారు. ఏ పండుగ అయినా, శుభకార్యమైనా ఇంట్లోని దేవుడి ముంగిట దీపం వెలిగిస్తారు. నవరాత్రులు వంటి సమయాల్లో ఏకశిలా దీపం వెలిగిస్తారు. దీపపు వెలుగు మనిషి జీవితంలోని చీకటిని తొలగిస్తుందని, వారి ఆలోచనలను సానుకూలంగా మారుస్తుందని విశ్వసిస్తారు భక్తులు. దీపం వెలిగించడం ద్వారా ఇంట్లోని ప్రతికూల ప్రభావం తొలగిపోయి.. ప్రశాంతత సిద్ధిస్తుందనే విశ్వాసం కూడా ఉంది. అయితే, ఈ దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు? ఆ నియమాల ప్రకారం దీపం వెలిగిస్తేనే అనుకున్న ప్రయోజనాలు నెరవేరతాయని సిద్దాంతులు చెబుతున్నారు. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దీపం ఎక్కడ పెట్టాలి?.. పూజ సమయంలో దీపం వెలిగించేటప్పుడు దీపం ఎక్కడ ఉంచాలి? దీపంలో ఎలాంటి వత్తిని ఉపయోగించాలి? అనేది చాలా ముఖ్యం. నెయ్యితో దీపం వెలిగిస్తున్నట్లయితే దానిని దేవుడికి ఎడమవైపున ఉంచాలి. కుడి వైపున నూనె దీపాన్ని వెలిగించాలి. దీపంలో ఎప్పుడూ పత్తితో చేసిన వత్తులను మాత్రమే వినియోగించాలి. ఎర్రటి దారం వంటి వత్తులను అస్సలు వినియోగించొద్దు.
దీపం వెలిగించడానికి సరైన సమయం, దిశ ఏంటి?.. ఉదయం సమయం చాలా ప్రశాంతమైన సమయం కావున.. పూజను ఎంత త్వరగా చేస్తే అంత శుభప్రదం. పూజ సమయంలో దీపం వెలిగించడానికి ఉత్తమ సమయం ఉదయం 5 గంటల నుంచి 10 గంటలు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య దీపం వెలిగిస్తే శుభప్రదం. ఇంకా దీపాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పశ్చిమ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. దక్షిణం వైపున పూర్వీకులకు హోమం జరుగుతుంది.
దీపం పగలగొట్టవద్దు.. దీపం వెలిగించడానికి మెటల్ దీపం ఉపయోగించొచ్చు. మట్టితో చేసిన దీపం కుందులకు పగుళ్లు రావొద్దు. అంతే కాకుండా దీపం వెలిగించిన తర్వాత ఆరిపోకుండా జాగ్రత్తపడాలి. దీని కోసం గాజుతో తయారు చేసిన కవచాన్ని ఏర్పాటు చేయాలి. ఏ కారణం చేతనైనా దీపం ఆరిపోతే వెంటనే వెలిగించి భగవంతుని ప్రార్థించాలి.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, మత గ్రంధాల్లోని సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. టీవీ9 తెలుగు దీనిని ధ్రువీకరించలేదు.)
Also read: