Solar Eclipse 2025: ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు ? మన దేశంలో గ్రహణ ప్రభావం ఉంటుందో లేదో తెలుసుకోండి..

హిందూ మతంలో గ్రహణాలకు ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు సూర్య, చంద్ర గ్రహణాలను అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. 2025 సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది? ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో సూతకాలం చెల్లున్తుందో లేదో ఈ రోజు తెలుసుకుందాం..

Solar Eclipse 2025: ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు ? మన దేశంలో గ్రహణ ప్రభావం ఉంటుందో లేదో తెలుసుకోండి..
Surya Grahan

Updated on: Jun 28, 2025 | 2:14 PM

జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు సూర్యగ్రహణం ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటనగా పరిగణించబడుతుంది. దీనిని మతపరమైన దృక్కోణం నుంచి చూస్తే శుభప్రదంగా పరిగణించరు. సూర్యగ్రహణం సమయంలో ఎటువంటి శుభ లేదా మంగళకరమైన పనులు చేయరు. దీనితో పాటు సూర్యగ్రహణం సమయంలో ఆహారం తినడం, వంట చేయడం, నిద్రపోవడం కూడా నిషేధించబడింది. ఈ సంవత్సరం 4 గ్రహణాలు సంభవించాల్సి ఉంది. వాటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఇప్పటికే సంభవించింది. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం 2025లో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది? ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకుందాం.. సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదో కూడా వివరంగా తెలుసుకుందాం..

2025 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?

2025 సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21, 2025న ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో.. ఈ గ్రహణం సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 3:24 గంటలకు ముగుస్తుంది.

భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా?

ఈ సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూర్యగ్రహణ సూత కాలం భారతదేశంలో కూడా చెల్లదు. ఈ సూర్యగ్రహణం అమెరికా, ఆస్ట్రేలియా, ఫిజి, న్యూజిలాండ్ , అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదంటే

సూర్యగ్రహణం సమయంలో పూజలు చేయడం నిషిద్ధం.

గ్రహణ కాలం ప్రారంభమైన వెంటనే తులసి దళాలను ఆహార పదార్థాలలో వేయాలి

సూర్యగ్రహణం సమయంలో దేవుళ్ల విగ్రహాలను తాకకూడదు.

సూర్యగ్రహణ సమయంలో నిద్రపోకూడదు లేదా ఏమీ తినకూడదు.

సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు.

గ్రహణ సమయంలో కత్తెరలు, కత్తులు, సూదులు వంటి వస్తువులను ఉపయోగించరాదు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు