మన దేశంలో అనేక దేవాలయాలున్నాయి. దేవి దేవతలను భక్తితో పూజిస్తారు. అంతేకాదు ఆవు, ఏనుగు, పాము, ఎలుక, నెమలి వంటి జీవులను కూడా దైవంగా భావించి పూజిస్తారు. పండగలు, పర్వదినాల సమయంలో దేశంలోని నలుమూల్లో ఉన్న పవిత్ర క్షేత్రాలకు, శక్తిపీఠాలు, సిద్ధపీఠాలకు చేరుకుంటున్నారు. అలాంటి అద్భుతమైన దేవాలయంలో ఒకటి రాజస్థాన్ లోని బికనీర్ నగరంలో ఉన్న కర్ణి మాత ఆలయం. అద్భుతాలతో నిండిన ఈ శక్తిపీఠం బికనీర్ నగరానికి 32 కి.మీ దూరంలో ఉన్న దేశ్నోక్ గ్రామంలో ఉంది. మాతా కర్ణి దేవి వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ప్రపంచంలో భారీ సంఖ్యలో ఎలుకలు కనిపించే దేవాలయం కర్ణి దేవి ఆలయం.
ఎలుకలను దేవత సేవకులుగా పరిగణిస్తారు
సనాతన హిందూ సంప్రదాయంలో ఎలుకను గణపతి వాహనంగా పరిగణిస్తారు. అయితే కర్ణి ఆలయంలో భారీ సంఖ్యలో ఎలుకలు ఉంటాయి. ఈ ఎలుకలను కర్ణి మాత సేవకులుగా పిలుస్తారు. అవును కర్ణి మాతా దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో సుమారు 20వేలకు పైగా ఎలుకను సందడి చేస్తూ ఉంటాయి.
ప్రజలు ఎలుకలను కాబా అని పిలుస్తారు
ఈ ఆలయం ఎలుకల దేవాలయంగా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలో కనిపించే వేల ఎలుకలను స్థానిక ప్రజలు కాబా అని పిలుస్తారు. ఈ ఎలుకలు దైవత్వ ఎలుకలుగా ఆ గ్రామస్థులు పూజిస్తారు. మొత్తం ఆలయ ప్రాంగణంలో 20-25 వేలకు పైగా ఎలుకలు నివసిస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా అవి ఏ భక్తునికీ ఎటువంటి హాని కలిగించవు. ఈ ఎలుకలలో ఎవరైనా తెల్ల ఎలుకను చూసినట్లయితే.. అతని కోరిక త్వరలో నెరవేరుతుందని నమ్ముతారు. ఈ దేవాలయాన్నిసందర్శించడానికి దేశ, విదేశాల నుంచి యాత్రికులు వస్తూంటారు.
మాతా కర్ణి ఆలయంలో నైవేద్యం ముందుగా ఎలుకలకే..
ఇక్కడ అమ్మవారికి సమర్పించే ప్రసాదాన్ని ముందుగా ఎలుకలు తింటాయి. అనంతరం ప్రజలు దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎలుకలు తినడానికి వేరుశనగలు, పాలు మొదలైనవి ఇస్తారు. తల్లికి సమర్పించే ప్రసాదంపై ఈ ఎలుకలకే మొదటి హక్కు ఉంటుంది.
కర్ణిమాత అవతారం ఎలా జరిగిందంటే..
కర్ణి మాత అవతారం సుమారు ఆరున్నర వందల సంవత్సరాల క్రితం జరిగిందని స్థానికుల కథనం. చరణ్ కుటుంబంలో రిధు బాయి అనే అమ్మాయిగా కర్ణి మాత జన్మించింది. అమ్మవారి ఆలయంలో పూజలు కూడా చరణ్ కుటుంబానికి చెందిన వ్యక్తులు మాత్రమే చేస్తారు. ఈ కుటుంబంలోని వ్యక్తులు చనిపోయిన తర్వాత.. అతను కాబా రూపంలో అంటే ఎలుక రూపంలో తిరిగి జన్మిస్తాడని విశ్వాసం. మళ్ళీ ఈ కాబా మరణిస్తే.. అనంతరం చరణ్ కుటుంబంలో జన్మిస్తారని నమ్మకం. ఆలయం లోపల కాబా లేదా ఎలుకలను చాలా గౌరవంగా చూడడానికి ఇదే కారణం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలను, ప్రజల విశ్వాసాలపై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)