ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య శైవ క్షేత్రం శ్రీశైలం. నంద్యాల జిల్లాలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు మహాశివరాత్రి స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్ర వారం సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజ పటావిస్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్దంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు.
వేద మంత్రోచ్ఛారణలతో అర్చకులు వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేదమంత్రోచ్ఛారణలతో ఆహ్వానించిన శివరాత్రి ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శివరాత్రి బ్రహ్మోత్సవాల ధ్వజపటన్ని ఆవిష్కరించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..