
ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షంలో జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు దుర్గాష్టమి. దుర్గాష్టమి రోజు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను పూజిస్తారు. ఈ రోజు కనక దుర్గాదేవి శ్రీ దుర్గా దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఉదయం నుంచి శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
నవరాత్రి సందర్భంగా అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు దుర్గాష్టమి సందర్భంగా కనక దుర్గాదేవి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మగానే దర్శనమిస్తోంది. మహాకాళీ నుదుటి నుంచి ఉద్భవించినదే దుర్గాదేవి. అందుకనే కనకదుర్గమ్మను కాళీ, చండీ, రక్తబీజగా పూజిస్తారు. దుర్గాదేవి ఆరాధన వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రాక్షస బాధలు ఉండవని నమ్మకం.
దుర్గ అనే పేరు గత జన్మలోని దుర్గుణాలను చెరిపి.. సద్గుణాలుగా మార్చుతుందని.. నిర్మలమైన మనస్సుతో పూజించే భక్తులకు సంతోషాన్నిస్తుందని చెబుతారు. శరన్నవరాత్రుల్లో దుర్గా సప్తశతి, దుర్గా సప్త శ్లోకీ పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది. నవరత్రిలో చివరి మూడు రోజుల్లో దుర్గాసప్తశతి పారాయణం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు