AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2025: ఈ ఏడాది నవరాత్రి 22 లేదా 23 ఎప్పుడు ప్రారంభం అవుతాయి? కలశ స్థాపన శుభ సమయం ఎప్పుడంటే..

దేవీ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది శారదీయ నవరాత్రి ఉత్సవాల ప్రారంభ తేదీలో గందర గోళం నెలకొంది. ఈ నేపధ్యంలో నవ రాత్రి ఉత్సవాలు ఈ నెల 22 లేదా 23వ తేదీనా.. ఎప్పుడు ప్రారంభమవుతాయి? దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఘటస్థాపన శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసుకోండి..

Navaratri 2025: ఈ ఏడాది నవరాత్రి 22 లేదా 23 ఎప్పుడు ప్రారంభం అవుతాయి? కలశ స్థాపన శుభ సమయం ఎప్పుడంటే..
Navaratri 2025
Surya Kala
|

Updated on: Sep 15, 2025 | 4:55 PM

Share

సనాతన ధర్మంలో ఆశ్వయుజ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ మాసంలో శారదీయ నవరాత్రులు జరుపుకుంటారు. శారదీయ నవరాత్రులు శుక్ల పక్షంలో జరుపుకుంటారు. శారదీయ నవరాత్రులలో జగత్ జననీ దుర్గాదేవిని , ఆమె రూపాలైన నవ దుర్గలను పూజిస్తారు.

శారద నవరాత్రులలో దుర్గాదేవిని పూజించడం వల్ల అదృష్టం కలుగుతుందని.. ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని మత విశ్వాసం ఉంది. దీనితో పాటు జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ ఏడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి తెలుసుకోండి..

శారదీయ నవరాత్రి ఎప్పుడంటే ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో ప్రతిపాద తిథి నుంచి నవమి తిథి వరకు శారదీయ నవరాత్రులను జరుపుకుంటారు. ఈ సమయంలో దుర్గాదేవిని, ఆమె తొమ్మిది రూపాలను భక్తితో పూజిస్తారు. అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం తొమ్మిది రోజులు నవరాత్రి ఉపవాసం పాటిస్తారు. ఇలా ఉపవాసం చేయడం వలన భక్తుడి ప్రతి కోరిక నెరవేరుతుంది.

ఇవి కూడా చదవండి

నవరాత్రి 2025 ప్రారంభ తేదీ) వేద క్యాలెండర్ ప్రకారం శారదీయ మాసంలోని శుక్ల పక్షంలోని ప్రతిపాద తిథి సెప్టెంబర్ 22 సోమవారం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ప్రతిపాద తిథి సెప్టెంబర్ 23న ముగుస్తుంది. అంటే ప్రతిపాద తిథి సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 01:23 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 02:55 గంటలకు ముగుస్తుంది.

ఘట స్థాపన ఎప్పుడంటే సనాతన ధర్మంలో ఉదయ తిథిని పూజకు పవిత్రంగా పరిగణిస్తారు (ప్రదోష వ్రతం, అష్టమి వ్రతం తప్ప). కనుక సెప్టెంబర్ 22 నుంచి శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ రోజున ఘటస్థాపన అంటే కలశ స్థాపన చేయాల్సి ఉంటుంది. ఈ రోజున అమ్మవారి మొదటి రూపం అయిన శైలపుత్రిని భక్తితో పూజిస్తారు. ఉపవాసం ఉంటారు.

ఘటస్థాపన(కలశ స్థాపన) శుభ ముహూర్తం సెప్టెంబర్ 22న ఘటస్థాపనకు రెండు శుభ సమయాలు ఉన్నాయి. సాధకులు ఉదయం 06:09 నుంచి 08:06 గంటల మధ్య దుర్గాదేవిని ఘటస్థాపన చేయడం ద్వారా పూజించవచ్చు. దీని తరువాత అభిజిత్ ముహూర్తంలో ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:38 గంటల మధ్య ఘటస్థాపన కూడా చేయవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు