సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిధిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు. ‘సంకటహర’ అంటే ‘సంక్షోభం’ అని, ‘చతుర్థి’ అంటే ‘నాల్గవ రోజు’ అని అర్థం. ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథిని అఖూర్త సంకష్ట చతుర్థి అంటారు. దీనిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజించడం , ఉపవాసం ఉండటం వల్ల ప్రజలు వ్యాపారంలో విజయం సాధిస్తారని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. పనిలో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అఖూర్త సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి తెలుసుకుందాం..
పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్ష చతుర్థి తిథి డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10.06 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 19వ తేదీ ఉదయం 10.02 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఏడాది అఖూర్త సంకటహర చతుర్థి ని డిసెంబర్ 18 న జరుపుకుంటారు., ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున సాయంత్రం గణపతిని పూజిస్తారు. దీని తర్వాత ఉపవాసం విరమిస్తారు.
సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుడిని నియమ నిష్టలతో పూజించడం ద్వారా అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. సంకటహర చతుర్థి రోజున గణేశుని కోరిన కోరికలు నెరవేరుతాయి. గణేశుడు మేధస్సుకు అదిదేవుడు. ఆయనను ఆరాధించడం వల్ల తెలివితేటలు వృద్ధి చెందుతాయి. జ్ఞానం పెరుగుతుంది. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూల శక్తిని నింపుతుంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.