ఇంద్రకీలాద్రిపై శ్రావణశోభ సంతరించుకుంది. ఈ నెల 17 నుండి ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వ తేదీన వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైవున్న దుర్గమ్మ వరాలిచ్చే వరలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అంతేకాకుండా సెప్టెంబర్ నెల 8 నుండి ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవగా సామూహిక వరలక్ష్మి పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ సామూహిక వరలక్ష్మి పూజల్లో ఎవదిమంది భక్తులు పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పిస్తుంది. ఈ సామూహిక వరలక్ష్మి పూజల్లో పాల్గొనే భక్తులు పూజకు గాను 1500 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. ప్రతియేడు జరిగే ఈ పూజల్లో వందల సంఖ్యలో భక్తులు పాల్గుని సామూహికంగా వరలక్ష్మి పూజలు చేస్తుంటారు. ఇక ఈ ఏడుకూడా అదే స్థాయిలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు. ఇక ఎప్పటిలాగానే ఇంద్రకీలాద్రి మహామండపం ఆరో అంతస్తులో ఉదయం ఏడు గంటల నుండి 9 గంటల వరకు ఈ వ్రతం జరుగుతుంది. సామాన్య భక్తుల కోసం ప్రత్యేకంగా 500 రూపాయల టికెట్ తో 9 గంటల నుండి ప్రారంభం అవుతాయి. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉత్సవమూర్తుల ఎదుట జరుగుతాయి. అంతే కాకుండా ఉచితంగా సామూహిక వరలక్ష్మి పూజలో పాల్గొనే భక్తుల కోసం కూడా సెప్టెంబర్ మూడు నుండి ఐదో తేదీ వరకు పేర్లు నమోదు చేసే అవకాశం కల్పించారు ఆలయ అధికారులు.
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం మన హిందూ సంప్రదాయం..హిందూ సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతంకు ఒక ప్రతేయకమైన విశిష్టత ఉంది. దీన్ని పెళ్ళైన మహిళలు కచ్చితంగా పాటిస్తారు. వరాలిచ్చే వరలక్ష్మి దేవి కి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేస్తే పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటూ అష్ట ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో సుఖసంతోషలతో ఉంటారని నమ్మకం. ఇదే విషయాన్ని శివుడు పార్వతి దేవికి చెప్పినట్లుగా స్కందపురాణంలో ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..